Nandamuri Family: మరో ఎన్టీఆర్ ఎంట్రీ.. ఎవరో తెలిస్తే షాక్..!

Nandamuri Family.. నందమూరి ఫ్యామిలీ అనగానే స్వర్గీయ లెజెండ్రీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ద్వారానే ఈ కుటుంబం వెలుగులోకి వచ్చింది. ఈ కుటుంబం నుంచి కొంతమంది వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మొదటి జనరేషన్ నందమూరి తారక రామారావు అయితే ఆ తర్వాత ఆయన కొడుకులు రెండవ జనరేషన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు మూడవ జనరేషన్ వారు కూడా నటులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నాల్గవ జనరేషన్ కి సంబంధించి మరొక వారసుడు రాబోతున్నాడని సమాచారం.. ఇకపోతే నందమూరి ఫ్యామిలీకి ఆజ్యం పోసిన ఎన్టీఆర్ వారసులుగా ఇప్పటికే కొంతమంది ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కొడుకులుగా ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కడే సక్సెస్ అయ్యారు.. కొన్నేళ్ల క్రితం హరికృష్ణ కూడా ప్రేక్షకులను అలరించారు.. కానీ ఆయన కారు ఆక్సిడెంట్ లో మరణించి లోకాన్నే విడిచి వెళ్లిపోయారు.

మూడవ తరమే కాదు నాల్గవ తరం నుండి కూడా…

Nandamuri Family: Another NTR entry.. Shock to know who it is..!
Nandamuri Family: Another NTR entry.. Shock to know who it is..!

ఇక మూడవ తరం విషయానికి వస్తే.. ఎన్టీఆర్ స్టార్ హీరోగా రాణిస్తుండగా ఆయనతో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ అటు హీరోగా, ఇటు నిర్మాతగా కూడా దూసుకుపోతున్నారు.. అలాగే తారకరత్న కూడా హీరోగా కొన్ని సినిమాలు చేసి మెప్పించారు. కానీ ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులయ్యారు. ఇప్పుడు ఇదే నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నారు. అది కూడా హరికృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు.. అంటే మరో ఎన్టీఆర్ రాబోతున్నారని చెప్పాలి.. ఇకపోతే హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ కొన్నేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా ఇప్పుడు ఆయన కుమారుడు.. హరికృష్ణ మనవడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇండస్ట్రీలోకి హరికృష్ణ మనవడు ఎంట్రీ..

ఇక హీరోగా ఈ రోజే లాంచ్ కానున్నాడు.. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ఈరోజు చాలా గ్రాండ్ గా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. దీనికి నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది ఈవెంట్ కి హాజరు కాలున్నట్లు సమాచారం.. అంతేకాదు ఇక్కడ హీరోగా పరిచయం కాబోతున్న జానకిరామ్ కొడుకు పేరు కూడా ఎన్టీఆర్ కావడం విశేషం.. ఆయనకి కూడా నందమూరి తారక రామారావు అని పేరు పెట్టారట.. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హోదాలో కొనసాగుతూ ఉండగా ఇప్పుడు మరో ఎన్టీఆర్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండడం విశేషం..

- Advertisement -

మరో ఎన్టీఆర్.. కన్ఫ్యూజన్ మొదలు..

ప్రస్తుతం ఈ విషయం అభిమానులలో ఆనందాన్ని కలిగిస్తున్నా..ఒకపక్క కన్ఫ్యూజన్ ని కూడా రేకెత్తిస్తోంది ఇక ఎన్టీఆర్ పేరు ఎత్తగానే కన్ఫ్యూజన్ కచ్చితంగా మొదలవుతుందని.. ఈ కొత్త ఎన్టీఆర్ ని ఏమని పిలుస్తారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.. ఒకరకంగా ఇది ఇప్పుడు కన్ఫ్యూజన్ మేటర్ గా మారబోతోంది. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో చరిత్ర సృష్టించారో అందరికీ తెలిసిందే..ఇక ఆయన వారసుడి గా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా నేడు గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు.. మరి ఇప్పుడు కొత్తగా రాబోయే ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో..? తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటాడా? లేదా? అనే సందేహాలు కూడా మొదలయ్యాయి.. మరి ఈ కుర్ర ఎన్టీఆర్ ఏ స్థాయికి చేరుకుంటాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు