Nani: రేర్ అచీవ్మెంట్, అది నానికి మాత్రమే సాధ్యం అయింది.

Nani: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ లో నాని ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన అష్టా చమ్మ సినిమాతో నటుడుగా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఆ తర్వాత నటుడుగా ఎన్నో సినిమాలు చేశాడు నాని. ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఎంచుకొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇప్పటివరకు నాని కెరియర్ లో వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ లో జెర్సీ ఒకటి చెప్పొచ్చు. జెర్సీ సినిమా తర్వాత నాని ఎంచుకున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. కమర్షియల్ గా హిట్స్ సాధించడంతోపాటు మంచి ప్రశంసలు కూడా అందుకుంది.

ఇకపోతే స్వతహాగా నాని అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటుడు అవడం వలన చాలామందిలో ఉన్న దర్శకత్వ ప్రతిభను గమనిస్తూ ఉంటాడు. అయితే నాని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో శ్రీకాంత్ ఓదెల ఒకరు. దసరా సినిమాతో శ్రీకాంత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మొదటి సినిమాతోనే దాదాపు 100 కోట్ల మార్కెట్లో చేరిపోయాడు. బాక్స్ ఆఫీస్ వద్ద దసరా సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. పేరుకు కొత్త డైరెక్టర్ అయినా కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిలా ఆ సినిమాను డీల్ చేశాడు శ్రీకాంత్.

Dasara Movie (2023) | Release Date, Review, Cast, Trailer, Watch Online at Netflix - Gadgets 360

- Advertisement -

ఇక నాని పరిచయం చేసిన దర్శకులలో శౌర్యవ్ ఒకరు. హాయ్ నాన్న సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శౌర్యవ్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన నా సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఓటిటి ఎంట్రీ తర్వాత కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు శౌర్యవ్. ఇక ప్రస్తుతం ఇద్దరు దర్శకులకి బెస్ట్ ఫిలిం డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఓకే హీరో ఇద్దరు దర్శకులను పరిచయం చేసే వాళ్లను బెస్ట్ డైరెక్టర్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒకవైపు కమర్షియల్ గా సినిమా హిట్ అయిన తర్వాత కూడా ప్రశంసలతో పాటు అవార్డులు రావడం అనేది రేర్ గా జరుగుతుంది ఎంతైనా వాళ్ళలోన టాలెంట్ ని గుర్తించినందుకు నాని ది రేర్ ఎచీవ్మెంట్ అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు