Nani : అవార్డులపై ఇంట్రెస్ట్ మొత్తం పోయింది… ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ వేదికపై నాని సంచలన వ్యాఖ్యలు..!

Nani.. తాజాగా హైదరాబాదులో 69వ సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ 2024 వేడుక చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం భాషలకు సంబంధించిన సౌత్ సినీ సెలబ్రిటీలు దాదాపు చాలామంది హాజరయ్యారు. ఈసారి వేడుకలలో చాలామంది యంగ్ స్టార్స్ ఎక్కువగా ఫిలింఫేర్ అవార్డులను దక్కించుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఉత్తమ నటుడు విభాగంలో నాచురల్ స్టార్ నాని దసరా సినిమాకి గానూ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ అవార్డు కోసం ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది ఈ అవార్డులపై నాని చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

Nani : All interest in awards is lost... Nani's sensational comments on the stage of Film Fair Awards
Nani : All interest in awards is lost… Nani’s sensational comments on the stage of Film Fair Awards

అవార్డులపై ఆసక్తి పోయింది..

తాజాగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న నాని మాట్లాడుతూ.. గతంలో ఈ అవార్డులు తీసుకోవాలని చాలా కోరిక ఉండేది . ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాను. అయితే ఈ అవార్డులు తీసుకోవాలనే కోరిక మెల్లమెల్లగా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది. నా సినిమాలకు పని చేసే డైరెక్టర్లు, టెక్నీషియన్స్, అలాగే నిర్మాతలు , అలాగే నా ప్రొడక్షన్ లో పరిచయమవుతున్న టాలెంటెడ్ నటీనటులు వాళ్లందరూ అవార్డులు అందుకుంటుంటే అక్కడి నుంచి చూడాలని నేను కోరుకుంటున్నాను. అది నేను చూడాలి అని ఆశిస్తున్నాను అంటూ తెలిపారు నాని. ఇకపోతే నాని నటించిన దసరా సినిమాకి ఉత్తమ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల ఫిలింఫేర్ అవార్డును దక్కించుకున్నారు. ఇటీవల నాని, మృణాల్ ఠాకూర్ తాజాగా నటించిన హాయ్ నాన్న చిత్రానికి కూడా ఉత్తమ నూతన దర్శకుడు విభాగంలో శౌర్యువ్ కూడా ఫిలింఫేర్ అవార్డును దక్కించుకోవడం జరిగింది. మొత్తానికి అయితే అవార్డులపై ఇంట్రెస్ట్ పోయిందని ఫిలింఫేర్ అవార్డ్స్ వేదికపై చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు నాని. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదే బిగ్గెస్ట్ అవార్డు..

ఇకపోతే తాను ఇక్కడికి ఎగ్జైట్ మెంట్ గా వచ్చింది అవార్డు తీసుకోవడానికి కాదు అని, తన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ తన దగ్గర తన సినిమాలో పనిచేసిన వాళ్లు, టాలెంటెడ్ పర్సన్స్ అవార్డులు తీసుకుంటుంటే చూడాలని వచ్చాను. ఇప్పుడు శ్రీకాంత్, శౌర్యువ్.. నా చేతుల మీదుగా అవార్డు లు తీసుకుంటుంటే ఆనందం తట్టుకోలేకపోతున్నాను. ఇక వారిద్దరితో పంచుకున్న ఈ అనుభవాలను నేను ఫ్రేమ్ కట్టించి నా ఇంట్లో పెట్టుకుంటాను అంటూ చాలా సంతోషంగా తెలిపారు. నా ప్రొడక్షన్ హౌస్ లో నా సినిమాలలో పనిచేసే ఎంతోమంది టాలెంటెడ్ టెక్నీషియన్స్ , ఆర్టిస్టులు ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి వారు వేసిన మొదటి అడుగులో నేను కూడా ఒక ఇటుక అయినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. అదే నాకు అందిన బిగ్గెస్ట్ అవార్డు. ఇక థాంక్యూ ఫిలిం ఫేర్ ర్ అంటూ స్పీచ్ ముగించారు నాని.. ప్రస్తుతం నాని చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు స్టేజ్ పై ఆయన మాట్లాడుతున్నంత సేపు కూడా కింద నుంచి చప్పట్లు, ఈలలతో సెలబ్రిటీలు సైతం ఎంకరేజ్ చేయడం మనం చూడవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు