Nani: అన్ని సినిమాలు హిట్టయ్యాయి గాని లాభాలు మాత్రం రాలేదు

Nani: నాచురల్ స్టార్ నాని (Nani) గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్లాప్ అసిస్టెంట్ కెరియర్ ని స్టార్ట్ చేసిన నాని తర్వాత ప్రముఖ దర్శకులు బాపు (Baapu) గారి దగ్గర కొంతకాలం పాటు పనిచేసి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన అష్టా చమ్మా అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నటుడుగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. నాని చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేశాయి. నాని కెరియర్లో రైడ్, పిల్ల జమిందార్, భీమిలి కబడ్డీ జట్టు అంటే ఎన్నో సినిమాలు అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాయి.

ఇక రీసెంట్ టైమ్స్ లో నాని చేసిన ఫిలిమ్స్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా చాలామంది ప్రేక్షకులకు బాగా నచ్చాయి. జెర్సీ(jersey) సినిమా తర్వాత నాని చేసిన ప్రతి సినిమా కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు నాని నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా తర్వాత నాని ఏ సినిమాకి సరైన కలెక్షన్లు రాలేదు అని తెలుస్తుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా కొంచెం యావరేజ్ గా ఆడింది. కానీ ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి.

 Actor Nani

- Advertisement -

ఆ తరువాత నాని చేసిన ఎన్నో సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్లు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మంచి కలెక్షన్లు రావలసిన సినిమాలకు కూడా టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వలన కలెక్షన్లు రాలేదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ కి కేటాయించిన రేట్లు చాలా తక్కువగా ఉండేవి. అయితే ఆ రేట్లు గురించి పెద్దగా హీరోలు ఎవరూ మాట్లాడకపోయినా కూడా నాని మాట్లాడుతూ వచ్చాడు. దానివలన చాలామందికి యాంటీ అయిపోయాడు. థియేటర్ ఓనర్ గురించి ఆ పక్కనే ఉన్న పాన్ షాప్ గురించి నాని అప్పట్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ చాలామందికి కరెక్ట్ అనిపించినా కూడా నానిని అప్పుడున్న ప్రభుత్వం టార్గెట్ చేసింది. మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA) సినిమా తర్వాత నాని చేసిన జెర్సీ, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి(Ante Sundaraniki), దసరా (Dasara) ఈ సినిమాలన్నిటికీ కూడా మంచి పేరు వచ్చింది. కానీ కలక్షన్స్ రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు