Nani : ధూమ్ దామ్ దోస్తాన్

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ద‌స‌రా. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద‌స‌రా పండుగ‌కు ముందు నాని ట్రీట్ ఇచ్చాడు. ఈ సినిమా నుంచి ద‌స‌రాకి ధూమ్ దామ్ దోస్తాన్ అంటూ సాగే సాంగ్ ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల చేశారు. ఇందులో నాని ఊర మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టాడు.

రామగుండం బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో రానున్న ఈ సినిమాలో నాని పూర్తిస్థాయి మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. నాని స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్స్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. తొలుత చెప్పిన స‌మ‌యానికి సాంగ్‌ను మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేయ‌లేదు. అభిమానులు ఒక్క‌సారిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొంచెం ఆల‌స్యం.. జ‌ర్ర ఓపిక ప‌ట్టండి. ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ వ‌స్తుంది అంటూ చిత్ర‌బృందం ట్వీట్ చేసింది.

తొలుత 3 అవ‌ర్స్ టుగో, 2 అవ‌ర్స్ టుగో, 1 అవ‌ర్ టుగో అంటూ అంచ‌నాల‌ను పెంచేసి.. చివ‌ర‌కు చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేయ‌క‌పోవ‌డం ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. ఆ త‌రువాత షురూ చేయుండ్రి అంటూ సాంగ్‌ను విడుద‌ల చేసారు. ఈ పాట విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. తెలంగాణ జాన‌ప‌దం, యాస ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట‌లో క‌న‌క‌వ్వ పాడిన బ‌తుక‌మ్మ పాట‌ను కూడా చేర్చ‌డం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు