Nani : పుష్ప రాజ్ కి నాని సాలిడ్ రిప్లై..

Nani : టాలీవుడ్ లో ఈ ఇయర్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు గ్రాండ్ గా జరిగాయి. కాగా ఈ ఇయర్ ఎక్కువగా మీడియం రేంజ్, చిన్న సినిమాలకే అవార్డులు రావడం జరిగింది. 2023 సంవత్సరానికి గాను దసరా, బలగం వంటి చిత్రాలకే ఎక్కువగా అవార్డులు వరించాయి. ఇక నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమాకి గానూ, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ నాని అవార్డు అందుకున్నాడు. ఇక నానికి అవార్డు వచ్చాక పలువురు తోటి స్టార్ హీరోలు, దర్శక, నిర్మాతలు, సినీ ప్రముఖులు నానికి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు. ఇక అవార్డు తీసుకున్నాక ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా, దానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషెస్ తెలియచేశాడు.

Nani gave an interesting reply to Allu Arjun

బన్నీ విషెస్ కి నాని సాలిడ్ రిప్లై…

ఇక నాని ఫిల్మ్ ఫేర్ అవార్డుతో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోకు అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యాడు. నానికి అభినందనలు తెలియచేస్తూ, కంగ్రాట్స్, యువర్ వెల్ డిజర్వుడ్… అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నాని కూడా బన్నీకి థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ గా రిప్లై ఇచ్చాడు.. నాని రిప్లై ఇస్తూ.. థాంక్యూ బన్నీ, నెక్స్ట్ ఇయర్ ‘ది రూల్’ గాయ్ మరిన్ని అవార్డులను తీసుకుంటాడు.. అని ట్వీట్ వేసాడు. దీన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ అవార్డు పుష్ప రాజ్ కే వస్తుందని నాని ట్వీట్ వేసాడని తెలుస్తుంది. ఇక ఇది బన్నీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. ఈ ట్వీట్ ని సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

- Advertisement -

నెక్స్ట్ ప్రాజెక్ట్ లో నాని బిజీ…

ఇక నాని (Nani) తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఒక పక్క నాని హీరోగా సరిపోదా శనివారం చిత్రంతో ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు. అలాగే సుజీత్ తో కూడా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక మరొక పక్క బన్నీ ‘పుష్ప2 ది రూల్’ తో డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు చిత్రాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక సరిపోదా శనివారం సినిమా నుండి ఇప్పటికే టీజర్, సాంగ్స్ రాగా, త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు