Sujeeth: సుజీత్ తో తన ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చిన నాని

Sujeeth: సుజిత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సుజిత్. సుజిత్ ముందు షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరియర్ మొదలుపెట్టి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. సుజిత్ కి సినిమా అవకాశం రెబల్ స్టార్ ప్రభాస్ వలన దక్కింది అని చాలామందికి తెలియని విషయం. సుజీత్ షార్ట్ ఫిలిం చేస్తున్న టైంలో ఒక షార్ట్ ఫిలిమ్ చూసి ప్రభాస్ సుజిత్ కి కబురు పెట్టడం, అలానే యూ వీ క్రియేషన్స్ లో చెప్పడంతో సుజిత్ యొక్క సినిమా కెరియర్ మొదలైంది.

సుజీత్ చేసిన మొదటి సినిమా రన్ రాజా రన్ అద్భుతమైన హిట్ అయి మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. తర్వాత రెండో సినిమాకే ప్రభాస్ తో పనిచేసే అవకాశం దక్కింది. బాహుబలి సినిమా తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సాహో సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఏదేమైనా సినిమా ఫెయిల్ అయినా కూడా సుజిత్ కి మాత్రం మంచి పేరు లభించింది. బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ ను డీల్ చేయటం అనేది మామూలు విషయం కాదు. కానీ సినిమా తెలుగులో ఆడకపోయినా హిందీలో మంచి రెస్పాన్స్ ను సాధించింది.

టెక్నికల్ గా కూడా సినిమా చాలా బాగుందంటూ కొన్ని ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం సుజిత్ చేస్తున్న సినిమా “ఓజి”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. తన మూడవ సినిమానే దర్శకుడుగా పవన్ కళ్యాణ్ తో చేయటం అనేది మామూలు విషయం కాదు. ఇకపోతే ఓజీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ మంచి అంచనాలను పెంచింది. పవన్ కళ్యాణ్ ను ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటున్నాడు అని సుజిత్ కి తెలుసు. ఎందుకంటే స్వతహాగా సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కావడం వలన.

- Advertisement -

Nani32

పవన్ ను బాగా చూపిస్తాడని చాలామంది అభిమానులకి నమ్మకం కూడా ఉంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత సుజిత్ నానితో సినిమా చేయనున్నట్లు సమాచారం వినిపించింది. తరువాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటూ వార్తలు కూడా వచ్చాయి. దీనిపై నాని స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. శ్రీకాంత్ ఓదెల సినిమా పూర్తయ్యాక ఈ సినిమా ఉండబోతుంది అని నాని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు