Dasara: వంద కోట్ల క్లబ్ లో నాని.. టైర్ 2 హీరోల్లో ఫాస్టెస్ట్ రికార్డు

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. టైర్ 2 హీరోల్లో నానికి మళ్ళీ నెంబర్ 1 స్థానాన్ని తెచ్చి పెట్టింది. MCA తర్వాత మళ్ళీ తనకు కమర్షియల్ సక్సెస్ కు పెద్దగా రాలేదు. జెర్సీ, శ్యామ్ సింగ రాయ్ లాంటి ప్రయోగాత్మక సినిమాలు మంచి సక్సెస్ అయినా తనకి ఫుల్ మాస్ సినిమా పడలేదు. ఇప్పడు దసరా సినిమా తో తీరిపోయింది. ఈ సినిమా తో నాని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. మార్చి 30 న విడుదలైన ఈ సినిమా స్టార్ హీరోల లెవెల్లో మాస్ రికార్డులు నెలకొల్పింది.

విడుదలైన 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవగా నాని కెరియర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. నాని హీరోగా నటించిన దసరా సినిమాని శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. SLV సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు.

తాజాగా ఈ సినిమా మరో రికార్డు ని సృష్టించింది. విడుదలైన 7 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. టైర్ 2 హీరోల్లో ఇది ఫాస్టెస్ట్ రికార్డు. ఇంతకు మందు టైర్ 2 హీరోల్లో విజయ్ దేవరకొండ గీతా గోవిందం, నిఖిల్ కార్తికేయ 2 సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టారు. ఇప్పుడు నాని మూడో హీరోగా దసరా చిత్రం ద్వారా 100 కోట్లు సాధించాడు. ఈ సినిమా కలెక్షన్స్ ఎండ్ అయ్యే నాటికీ 120 నుంచి 130 కోట్ల వరకు వసూలు చేయవచ్చు.

- Advertisement -

అయితే ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్ లో తొలి సరిగా చేరిన హీరోలను వారి సినిమాల్తో గమనించగా వరుసగా రామ్‌చరణ్ – మగధీర 2009
మహేష్ బాబు – దూకుడు 2011
పవన్ కళ్యాణ్ – గబ్బర్ సింగ్ 2012
అల్లు అర్జున్ – రేసుగుర్రం 2014
ప్రభాస్ – బాహుబలి 2015
ఎన్టీఆర్ – జనతాగ్యారేజ్ 2016
నాగార్జున – ఊపిరి 2016
చిరంజీవి – ఖైదీ నెంబర్150 2017
విజయ్ దేవరకొండ – గీతాగోవిందం 2018
వెంకటేష్ – F2 2019
వరుణ్ తేజ్ – F2 2019
బాలకృష్ణ – అఖండ 2021
నిఖిల్ – కార్తికేయ2 2022
రవితేజ – వాల్తేరు వీరయ్య 2023
నాని(సోలో ) – దసరా 2023

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు