Nani: రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్ర, ఇది మాములు డెడికేషన్ కాదు

Nani: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు చిత్ర యూనిట్. తెలుగు తమిళ్ భాషల్లో కూడా ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. లేకపోతే ఈ సినిమాకి సంబంధించి నాని ఎంతలా కష్టపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు హైదరాబాద్ తో పాటు, చెన్నై, కేరళలో కూడా ఈ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు నాని.

ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచుతుంది. అన్నిటిని మించి ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలి. సినిమాకి సంబంధించిన కథను కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో రివిల్ చేసేసారు. ఎస్ జె సూర్య అయితే మరీ డీటెయిల్ గా ఈ సినిమా కథను చెప్పేసాడు. అయితే ఇంత ఇంట్రెస్టింగ్ పాయింట్ వివేకాత్రేయ ఎలా డీల్ చేసాడు అని అందరూ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన అంటే సుందరానికి సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

Saripodhaa Sanivaaram

- Advertisement -

ఇకపోతే ఆ సినిమా గురించి కూడా ఇప్పటికీ మంచి పాజిటివ్ వర్డ్స్ చెబుతూ ఉన్నాడు నాని. ఇక సరిపోదా శనివారం సినిమాకి సంబంధించి నాని రెస్ట్ లేకుండా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. నిన్న దాదాపు 12 వీడియో ఇంటర్వ్యూస్, అలానే మూడు ఆడియో ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. టైం ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ కేవలం మూడు గంటల పాటు మాత్రమే నిద్రపోతూ సినిమాని తన శక్తికి మించి ప్రమోట్ చేస్తున్నాడు నాని. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధిస్తుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు