Nani – SrikanthOdela : భాగ్యనగరపు బ్యాక్ డ్రాప్ లో నెవర్ బిఫోర్ రేంజ్ లో నాని సినిమా!

Nani – SrikanthOdela : టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ దసరా సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల, నాని హీరోగా దసరా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవగా, తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. నాని ని సరికొత్త మేకోవర్ లో ఊర మాస్ గా చూపించి భారీ హిట్ కొట్టడమే కాకుండా దర్శకుడిగా సుకుమార్ కి తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. ఇక నాని కెరీర్ లో దసరా తోలి వంద కోట్ల చిత్రం అని తెలిసిందే. ఇక బుచ్చిబాబు తరవాత తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు అందుకున్న దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల నిలిచాడు. ఇదిలా ఉండగా శ్రీకాంత్ ఓదెల ఆ తర్వాత ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తాడా అని అనుకోగా ఫైనల్ గా మళ్ళీ నానితోనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా గురించి తాజాగా సాలిడ్ అప్డేట్ వచ్చింది.

Nani - Srikanth Odela Upcoming movie Update

నెవర్ బిఫోర్ రేంజ్ లో నాని మేకోవర్…

ఇక నాని – శ్రీకాంత్ ఓదెల (Nani – SrikanthOdela) కాంబోలో రాబోయే కొత్త సినిమాకి సంబంధించి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా హైదరాబాద్ – సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుండగా, నాని నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపిస్తున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా కోసం ఓల్డ్ సికింద్రాబాద్ ని తలపించేలా ఓ భారీ సెట్ ని నిర్మించబోతున్నారట. ఆ సెట్ విలువే 10 కోట్లు ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా బడెజ్ట్ కూడా ఏకంగా 120 నుండి 150 కోట్ల బడ్జెట్ వరకు అవుతుందని సమాచారం. అలాగే భారీ తారాగణంతో పాటు, భారీ టెక్నిషియన్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేయనున్నారట.

- Advertisement -

రెగ్యులర్ షూట్ అప్పటినుండే…

ఇక నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కనున్న ఈ రెండో సినిమాకి సంబంధించి ఇది వరకు మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోష్ నారాయణ్ ని అనుకోగా, తాజాగా వేరే మ్యూజిక్ డైరెక్టర్ కోసం చూస్తున్నారని తెలుస్తుంది. ఇక దసరాకు కూడా ఇంతకు ముందు సంతోషే మ్యూజిక్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుండి షూట్ ఉండవచ్చని సమాచారం. ఈలోపు నాని సరిపోదా శనివారం రిలీజ్ చేసి, డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సినిమా కూడా ఫినిష్ చేసే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు