Nani: ఈ దశాబ్దంలో నాకు ఇష్టమైన సినిమా అది

Nani: ప్రస్తుతం తెలిపిన ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నాని ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను నాని ప్రస్తుతం తన కెరియర్ లో చేసుకుంటూ వెళ్తున్నాడు. జెర్సీ సినిమా తర్వాత నాని ఎంచుకున్న ప్రతి సినిమా కూడా ఆడియన్స్ కి మంచి అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పొచ్చు. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని రాజకీయ పరిస్థితుల వలన ఆ సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. కానీ నానికి మాత్రం మంచి పేరునైతే తీసుకొచ్చాయి. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో నాని చాలామంది కొత్త దర్శకులను కూడా పరిచయం చేశాడు.

కేవలం నాని హీరోగా కొత్త దర్శకులను పరిచయం చేయడం కాకుండా, వాల్పోస్టర్ అనే ప్రొడక్షన్ హౌస్ నిర్మించి దాని ద్వారా కూడా కొంతమంది దర్శకులను పరిచయం చేస్తూ వస్తున్నాడు. నెక్స్ట్ ఆ బ్యానర్ లో జగదీష్ అని మరో దర్శకుడుని కూడా పరిచయం చేస్తున్నాడు నాని. ఇకపోతే నాని రీసెంట్ గా డార్లింగ్ అనే ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఆ ఈవెంట్లో నాని మాట్లాడుతూ తనకి ఇష్టమైన సినిమా బలగం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Balagam

- Advertisement -

నాకు ఈ డికెడ్ లోనే బాగా నచ్చిన సినిమా బలగం అంటూ చెప్పుకొచ్చాడు. బలగం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంత గొప్ప సినిమా వచ్చింది అని చెప్పాలి. ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. చాలామంది ఊర్లలో ఈ సినిమాను ప్రదర్శించి అందరూ కలిసి చూడటం అనేది మంచి అనుభూతిని కూడా ఇచ్చింది. ఈ సినిమాతో దిల్ రోజు ప్రొడక్షన్స్ బ్యానర్ మొదలైంది. ఈ సినిమా తర్వాత నాని వేణుతో సినిమాను కూడా చేస్తాడు అని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టారు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు