Nani: ఇందుకే కదా నాచురల్ స్టార్ అనేది, నాని టైమింగ్ మామూలుది కాదు

Nani:అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన నాని అష్ట చమ్మ సినిమాతో నటుడుగా మరో అడుగు వేశాడు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేశాడు నాని. అయితే చేసినవి తక్కువ సినిమాల అయినా కూడా నాని ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ప్రతి కథలో ఒక కొత్తదనం వెతుక్కున్నాడు. అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు నాని. నాని కెరియర్ లో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో కూడా నాని వరుసగా మంచి హిట్ సినిమాలు చేస్తున్నాడు.

మారుతి దర్శకత్వంలో నాని చేసిన సినిమా భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. కేవలం నాని కెరియర్ లో మాత్రమే కాకుండా మారుతి కెరియర్ లో కూడా మంచి సూపర్ హిట్ సినిమా ఇది. ఒక హీరో క్యారెక్టర్ కి మతిమరుపు అనే డిసీజ్ ను పెట్టి మంచి ఫన్ జనరేట్ చేసాడు మారుతి. అయితే ఆ తర్వాత మారుతి ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చేయటం ఎక్కువగా మొదలుపెట్టాడు. మారుతీ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఎన్ని చేసినా కూడా భలే భలే మగాడివే స్థాయి హిట్ మాత్రం ఏ సినిమా కూడా కాలేదు. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి కూడా మంచి స్కోప్ ఉంది.

Bhale Bhale Magadivoy

- Advertisement -

 

భలే భలే మగాడివే సినిమాకి సీక్వెల్ గురించి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. రీసెంట్ గా ఈ సీక్వెల్ పైన మరోసారి స్పందించాడు నాని. నాని నటిస్తున్న సరిపోద శనివారం (Saripodha Sanivaram) సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ భలే భలే మగాడివే సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అని అడిగినప్పుడు. నాని కన్ఫ్యూజ్ చేస్తూ చివరికి క్వశ్చన్ మర్చిపోయాడు.

భలే భలే మగాడివే సినిమాలో క్యారెక్టర్ ఎలా అయితే అప్పటికప్పుడు చాలా విషయాలు మర్చిపోతుందో అలానే మర్చిపోతూ యాంకర్ ని ఆశ్చర్యపరిచాడు. మొత్తానికి ఈ సినిమా సీక్వెల్ గురించి అయితే మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన వెంటనే నాని కామెడీ టైమింగ్ అదుర్స్ అందుకే నాచురల్ స్టార్ అనేది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు