Nani – Vivek Athreya : స్టేజ్ పైనే హ్యాట్రిక్ అనౌన్స్ చేసేసిన నాని.. ఈసారి సీట్లో కూర్చోనివ్వరట..

Nani – Vivek Athreya : నేచురల్ స్టార్ నాని నటించిన “సరిపోదా శనివారం” గత నెల ఆగష్టు 29న విడుదలై మంచి సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. డీసెంట్ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా రెండో రోజు నుండే అదిరిపోయే స్ట్రాంగ్ హోల్డ్ తో భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. నాని (Nani) – వివేక్ ఆత్రేయ (vivek atreya) కాంబోలో అంటే సుందరానికి సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై తెలుగు ఆడియన్స్ భారీగా అంచనాలు పెట్టేసుకున్నారు. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే సరిపోదా శనివారం మంచి హోల్డ్ చూపిస్తూ.. బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా సరిపోదా శనివారం విజయోత్సవ సభను చిత్ర యూనిట్ నిన్న గ్రాండ్ గా జరపడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ మొత్తం విచ్చేయడం జరిగింది.

Nani - Vivek Athreya hatrick movie update

స్టేజ్ పైనే హ్యాట్రిక్ అనౌన్స్ చేసేసాడు..

ఇక సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) విజయోత్సవ వేడుకలో నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయని ప్రశంసిస్తూ ఏకంగా హ్యాట్రిక్ కూడా అనౌన్స్ చేసేసాడు. స్టేజి మీద చిత్ర యూనిట్ ని, నటీనటుల్ని ఒక్కొక్కరిగా ప్రశంసిస్తూ.. వివేక్ ఆత్రేయ గురించి చెప్తూ.. తనతో చేయబోయే మరో సినిమా గురించి కూడా చెప్పుకొచ్చాడు. నాని మాట్లాడుతూ.. ఇది కరెక్ట్ టైమో కాదు తెలీదు గాని.. అంటూ.. వివేక్ తో అంటే సుందరానికి (Ante Sundaraniki) చిత్రంతో డ్రామా అయిపోయింది, ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రంతో యాక్షన్ అయిపోయింది.. ఇక ఈసారి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చేద్దాం అని నాని చెప్పుకొచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకులని సీట్లో కూర్చోనివ్వకుండా చేద్దాం అంటూ నాని చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడు చేస్తామో తెలీదు గాని, పక్కా కామెడీ సినిమాయే చేద్దాం అని నాని అన్నాడు.

- Advertisement -

వంద కోట్ల దిశగా సరిపోదా శనివారం..

ఇక స్టేజి పైనే నాని మరో అవకాశం ఇవ్వడంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ చాలా సంతోషంతో నాని ను హగ్ చేసుకున్నాడు. ఇక సరిపోదా శనివారం ఇప్పటికే 75 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేయగా, వంద కోట్ల దిశగా ఈ సినిమా దూసుకుపోతుంది. అలాగే ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాలర్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో వరదల భీభత్సం వల్ల కలెక్షన్లు తగ్గగా, ఇప్పుడు వర్షాల ప్రభావం తగ్గడంతో సరిపోదా శనివారం పుంజుకునే ఛాన్స్ ఉంది. అలాగే నైజాంలో కూడా మరో కోటిన్నర వసూలు చేస్తే పూర్తిగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. మరి రెండో వీకెండ్ లో సరిపోదా శనివారం ఎలాంటి హోల్డ్ చూపిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు