Nani: ఆన్లైన్ ఫ్యాన్ వార్స్ గురించి నాని అంత మాట అనేసాడేంటి.?

Nani: రోజులు మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతాయి అని అంటారు. ఇక అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ప్రేక్షకుడు సినిమాను వెతుక్కుంటూ థియేటర్ కు వెళ్లేవాడు. కానీ ఇప్పుడు ప్రేక్షకుడిని వెతుక్కుంటూ థియేటర్ నుంచి సినిమా ఇంటికి వచ్చేస్తుంది. కేవలం నాలుగు వారాలు ఆగితే చాలు కుటుంబమంతా కలిసి ఇంట్లో కూర్చుని ఆ సినిమాను ఓటీటీ లో చూడొచ్చు అని ఫిక్స్ అయిపోయారు. అందుకే ఒక పెద్ద సినిమాకు మినహాయిస్తే చాలా సినిమాలకి ఆడియన్స్ రావడం తగ్గించారు. మంచి కాన్సెప్ట్ తో చిన్న సినిమాలు వచ్చినప్పుడు చాలామంది యూత్ థియేటర్ కి వెళ్లి ఆ సినిమాను ఎంకరేజ్ చేస్తున్నారు.

ఇక ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ కూడా బీభత్సంగా ఉండేవి. తమ హీరో సినిమా రిలీజ్ అయితే అతిపెద్ద కటౌట్ పెట్టడం, ఆ తర్వాత అవతల హీరో సినిమా రిలీజ్ అయితే దీనిని మించిన కటౌట్ పెట్టడం ఇలా జరుగుతూ ఉండేవి. ఒకప్పుడు రికార్డ్స్ కూడా ఏ సెంటర్లో ఎన్ని రోజులు ఆడింది. ఎన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ రీసెంట్ టైమ్స్ లో అది కూడా మారిపోయింది. కేవలం కలెక్షన్స్ మాత్రమే ఇప్పుడు ప్రాధాన్యం అయింది. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే దాన్ని బట్టి ఆ సినిమా హిట్ డిసైడ్ చేస్తున్నారు.

Nani

- Advertisement -

ఇక రీసెంట్ టైమ్స్ లో ఫ్యాన్ వార్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్న ఫ్యాన్ వార్స్ అన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతుంటాయి. మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం ఒకరినొకరు ట్రోల్ చేసుకోవటం వంటివి సోషల్ మీడియాలో జరుగుతాయి. అయితే వీటి గురించి నాన్ స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అనేవి వీడియో గేమ్స్ ఆడుకోవడం లాంటివి. దానిలో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది అని చెబుతూ వచ్చాడు. దీనిని బట్టి సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్ నువ్వు సీరియస్ గా తీసుకోకండి అని నాని చెప్పినట్లు అర్థమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు