Nara Rohith: నా సినిమా హిట్ అవ్వలేదు, అని హీరోనే ఒప్పుకున్నాడు

Nara Rohith: బాణం(Banam) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయినా కూడా ఈ సినిమాకి ఇప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పొచ్చు. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా కూడా వాటికి కల్ట్ స్టేటస్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అప్పుడున్న పరిస్థితుల వలన ఆ సినిమా ఆడకపోవచ్చు. కానీ ఆ కథను మళ్ళీ చూసినప్పుడు అరే ఇంత మంచి సినిమా ఎలా ప్లాప్ అయింది అని ఆలోచన రావడం మానదు.

గుర్తుండిపోయే సినిమాలు

ఇక నారా రోహిత్(Nara Rohit) తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశాడు. అందరి హీరోలలా కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకున్నాడు. కొంతమంది యంగ్ హీరోస్ కేవలం సక్సెస్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తూ ఒక మూస ధోరణిలో ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు అలా చేసిన సినిమాలు సక్సెస్ అయి ఉండొచ్చు. కానీ ప్రతి హీరో కూడా తన కెరియర్ లో కొన్ని గుర్తుండే సినిమాలు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలా నారా రోహిత్ విషయానికి వస్తే తన కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు చేశాడని చెప్పొచ్చు.

కేవలం వినోదం మాత్రమే కాదు

ఇక నారా రోహిత్ సినిమాల విషయానికొస్తే కేవలం వినోదం మాత్రమే కాకుండా సొసైటీకి సంబంధించిన మెసేజెస్ ఏవో ఒకటి అంతర్లీనంగా తన సినిమాల్లో కనిపిస్తూ ఉండేవి. ప్రతినిధి(Prathinidhi), రౌడీ ఫెలో(Rowdy Fellow), సోలో(Solo), అసుర(Asura), అప్పట్లో ఒకడుండేవాడు(Appatlo Okadundevadu) వంటి సినిమాల్లో ఎన్నో అద్భుతమైన మెసేజెస్ ఇచ్చాడు. ఇక ప్రతినిధి సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద సక్సెస్ సాధించింది అనేది పక్కన పెడితే, ఆ సినిమాకి ఇప్పటికీ ఒక మంచి గౌరవం దక్కుతుంది అని చెప్పాలి. అందుకనే ఆ సినిమాకి సీక్వెల్ గా ప్రతినిధి 2 సినిమాను తెరకెక్కించారు.

- Advertisement -

Prathinidi

ప్రతినిధి 2 సినిమా వచ్చినట్లే తెలియదు

ప్రతినిధి 2(Prathinindhi 2) సినిమాకి జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించారు. జర్నలిస్టుగా మంచి గుర్తింపు సాధించుకున్న మూర్తి తన జర్నలిజం కెరియర్లో తాను చూసిన అనుభవాలను బట్టి ఒక కథను సిద్ధం చేసి ప్రతినిధి 2 గా తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. చాలామందికి ఈ సినిమా ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. అయితే ఇదే విషయాన్ని స్వయంగా నారా రోహిత్ సుందరకాండ సినిమా ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. లాస్ట్ సినిమా నాది పోయింది. ఆ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు అంటూ తెలిపాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు