NaraSimhaNayudu ReRelease : NBK50ఇయర్స్ స్పెషల్ “నరసింహనాయుడు”… ఇంద్రని టార్గెట్ చేసే పట్టుబట్టి దించుతున్నారా?

NaraSimhaNayudu ReRelease : నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నటవారసుడిగా ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేస్తూ.. రెండవ తరంలో అగ్ర కథానాయకులలో ఒకడిగా టాలీవుడ్ ని శాసించాడు. ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోగా వరుస హిట్లు కొడుతూ, ఇప్పటి యంగ్ స్టార్స్ కి కూడా పోటీనిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే బాలయ్య త్వరలో చిత్ర పరిశ్రమలో నటుడిగా 50ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వారు, అలాగే నందమూరి అభిమానులు సహా NBK 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేయనున్నారు. అయితే ఈ సందర్బంగా బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “నరసింహనాయుడు” సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.

Narasimhanaidu movie is being re-released as NBK50 years special

ఇంద్ర ని బ్రేక్ చేయడం కోసమేనా?

బాలయ్య నటించిన నరసింహనాయుడు ఆరోజుల్లో అన్ని ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత దీన్ని భారీ మార్జిన్ తో చిరంజీవి ఇంద్ర సినిమాతో బ్రేక్ చేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసారు. ఇక ఇప్పుడు బాలయ్య నరసింహనాయుడు ఆగష్టు 30న రీ రిలీజ్ కాబోతుంది. బాలయ్య నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా నరసింహనాయుడు రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇన్సైడ్ టాక్ మాత్రం వేరేలా ఉంది. రీసెంట్ గా చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్ అయిన ఇంద్ర థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుని ఏకంగా 3.44 కోట్ల కలెక్షన్స్ సాధించింది. మరీ సాలిడ్ రికార్డ్స్ కాకపోయినా, సీనియర్ స్టార్ హీరోలలో టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ చేయడం కోసమే పట్టుబట్టి బాలయ్య అభిమానులు ఈ సినిమాని రిలీజ్ చేయిస్తున్నారని సమాచారం.

- Advertisement -

రీ రిలీజ్ తోనూ అభిమానుల యుద్ధం..

అయితే సడన్ గా నరసింహనాయుడు రీ రిలీజ్ ని నాలుగు రోజుల ముందు మాత్రమే ప్రకటించారు. ఆగష్టు 30న రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం సిటీ ఏరియాల్లో అభిమానులు ఎలాగైనా వస్తారు. కానీ మిగతా ఊళ్లలో జనాలకి తెలీదుగా. పైగా ఈ సినిమా రీ రిలీజ్ పై పెద్దగా మెజారిటీ అభిమానుల్లో ఆసక్తిలేదు. ఎందుకంటే ఇప్పటికే నరసింహనాయుడు పలుమార్లు రీ రిలీజ్ అయింది. అయినా సరే ఇంద్ర రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి ఈ సినిమానే కరెక్ట్ అని బాలయ్య ఫ్యాన్స్ డిసైడ్ అయినట్టున్నారు. అయితే రీ రిలీజ్ లో ఇంద్ర ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. ఇదిలా ఉండగా బాలయ్య – చిరంజీవి రచయిత రామజోగయ్య శాస్త్రి కుమారుడి పెళ్లి వేడుకలో ఆత్మీయంగా పలకరించుకున్న విషయం తెలిసిందే. అలాగే NBK 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కు మొదటి ఆహ్వానం మెగాస్టార్ చిరంజీవికే రావడం విశేషం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు