Malli pelli : పవిత్రతో లిప్ లాక్ పై నరేష్ లేటెస్ట్ కామెంట్

సోషల్ మీడియా అంత ప్రస్తుతం నరేష్, పవిత్ర లోకేష్ నటించిన మళ్ళీ పెళ్లి సినిమాపైనే చర్చ జరుగుతుంది. ప్రముఖ ప్రొడ్యూసర్ యంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్రల నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 26 న ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

తెలుగు సినిమాలలో ఫాదర్ రోల్స్ లో మరియు ప్రధాన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉండే యాక్టర్ నరేష్ . అలాగే చిన్న, చిన్న క్యారెక్టర్ లు మరియు హీరో, హీరోయిన్ ల మదర్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండే పవిత్రలోకేష్, వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి గత కొద్దీ రోజులుగా ట్రెండ్ అవుతుంది. కొంత మంది వీళ్ళకి ఆల్రెడీ పెళ్లయింది అంటుంటే, మరికొంత మంది సినిమా రిలీజ్ తరువాత చేసుకుంటారు అని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ న్యూస్ వీరిద్దరూ ఏది క్లారిటీ గా చెప్పడం లేదు. అయితే లేటెస్ట్ గా వీళ్లిద్దరు కలిసి నటించిన మళ్ళీ పెళ్లి సినిమా రిలీజ్ అవబోతుండటంతో, ప్రమోషన్స్ లో మాత్రం ఇద్దరు యాక్టీవ్ గా పాల్గొంటున్నారు.

ఇటీవలనే ఒక టీవీ షోకి హాజరైన ఈ ఇద్దరు స్టేజ్ పైనే డాన్స్ చేస్తూ, ముద్దులు పెట్టుకుంటూ వార్తల్లో నిలిచారు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారా, లేక ఇందులో నిజం ఎంత ఉంది అనేది ఎవరికీ అర్థం కానీ విషయం. తాజాగా ఒక ఇంటర్యూ లో పాల్గొన్న వీళ్ళిద్దరిని యాంకర్ స్టేజ్ పైన రొమాన్స్ గురించి మరియు 60ఏళ్ళ వయసులో లిప్ లాక్ ల గురించి అడగగా నరేష్ ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తూ “20 ఏళ్ళు ఉన్నవాళ్లు మాత్రమే ముద్దు పెట్టుకోవాలా 60 ఏళ్ళు ఉంటె పెట్టుకోకూడదా” అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక యాంకర్ కి నరేష్ కౌంటర్ ఇవ్వడంతో సోషల్ మీడియా అంత నరేష్ పై మిమ్స్ వేయడం స్టార్ చేసారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు