Naresh: పవిత్రను కాకుండా సీనియర్ నరేష్ మరో పెళ్లి చేసుకుంటాడా.?

Naresh: సీనియర్ నటుడు నరేష్ కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత మంచి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు జంధ్యాల దర్శకత్వంలో నరేష్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. ఇక ప్రస్తుతం సినిమాలలో ఎన్నో కీలకమైన పాత్రలో కనిపిస్తూ ఉంటారు నరేష్. ఏ రకమైన పాత్ర ఇచ్చిన కూడా దాన్లో ఒదిగిపోతుంటారు. ముఖ్యంగా రీసెంట్ డేస్ లో వచ్చిన చాలా సినిమాల్లో నరేష్ పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. నరేష్ లో కామెడీ యాంగిల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన కామెడీతో నిలబడిన సినిమాలు కూడా ఈ రోజుల్లో ఉన్నాయి అని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు.

సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన సమూహనం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్గా నిలిచింది. సుధీర్ బాబు కెరియర్లో మంచి హిట్ పేరు సాధించిన సినిమాల్లో సమ్మోహనం ఒకటి. ఈ సినిమాలు నరేష్ నటించిన తీరు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నరేష్ కామెడీ హైలెట్ అని చెప్పాలి. సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఈ కామెడీ అని కూడా కొంతమంది ఉద్దేశం. అయితే ఈ సినిమాలో నరేష్ తో పాటుగా పవిత్ర లోకేష్ నటించారు. అక్కడితో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

Actor Naresh

- Advertisement -

ఇక నరేష్ మొత్తానికి తన కెరీర్ లో మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవిత్రతో ప్రేమాయణం సాగిస్తున్నాడు నరేష్. ఇకపోతే రీసెంట్ గా నారా రోహిత్ నటించిన సుందరాకాండ అని సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు నరేష్. ఆ ఈవెంట్లో అసలు ఇప్పటి జనరేషన్స్ పెళ్లిళ్లు వద్దు అని అనుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు. మామూలుగా ఇప్పుడు జనరేషన్స్ పెళ్లిళ్లు వద్దు అని అనుకుంటున్నారు. కానీ మా జనరేషన్స్ ఇంకొకటి చేసుకుంటే బాగున్నేమో అని అనుకుంటారు అని సమాధానం ఇచ్చాడు. నరేష్ ఇచ్చిన ఈ ఆన్సర్ తర్వాత చాలామంది పవిత్ర ను దాటి నరేష్ మరొకరితో ప్రేమలో పడే అవకాశం ఉందేమో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు