Naresh-Vijay : సంకెళ్ల వెనుక శాంతి

అల్లరి నరేష్, ఒక కామెడీ హీరో గానే ఇండస్ట్రీకి వచ్చాడు. కామెడీ చేస్తూనే మంచి హీరోగా ఎదిగాడు. “కెవ్వుకేక” సినిమా వరకు కామెడీ జోనర్ లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమా తర్వాత కూడా అల్లరి నరేష్ నుండి కామెడీ సినిమాలు వచ్చాయి. కానీ, అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో రూట్ మార్చి, సీరియస్ పాత్రలను ఎంచుకోవడం స్టార్ట్ చేశాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో “మహర్షి” సినిమాలో ఓ కీలక పాత్రలో కొత్తగా కనిపించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, అదే పంథాను కొనసాగించాడు నరేష్. ఆ సమయంలోనే విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాంది చేశాడు. ఈ సినిమాతో అల్లరి నరేష్ స్టేజ్ మారిపోయింది. కామెడియన్ కాదు, సీరియస్ హీరో అని ప్రేక్షకులతో అనిపించుకున్నాడు.

ఈ సినిమా తర్వాత సభకు నమస్కారం, ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అల్లరి నరేష్ నుండి మరో అప్ డేట్ వచ్చింది. విజయ్ కనకమేడల-నరేష్ కాంబినేషన్ మరోసారి రాబోతుంది. వీరి కాంబోలో ఇప్పటికే నాంది వచ్చిన సంగతి తెలిసిందే. సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ కాంబోతో మరో సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అలాగే పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు.

- Advertisement -

ఈ లుక్ లో అల్లరి నరేష్ చేతులు సంకెళ్లతో కనిపిస్తున్నాయి. ఆ సంకెళ్ల చేతి వల్ల వెనుక కనిపించే ఛాయ పావురాన్ని పోలి ఉంది. దీని ద్వారా, ఎంతో హింసకు గురైన నరేష్, శాంతి కోరుకుంటున్నాడు అనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ఉంది. దీంతో విజయ్ కనకమేడల-నరేష్ పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తుంది. కాగా, ఈ ఒక్క పోస్టర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు