Dhruv Vikram: యంగ్ హీరో తో సినిమా చేయబోతున్న నేషనల్ అవార్డు ఫిల్మ్ మేకర్

Dhruv Vikram: సుధా కొంగర గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. విక్టరీ వెంకటేష్ తో గురు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించింది సుధా కొంగర. గురు సినిమా వెంకటేష్ కెరియర్ లో మంచి హిట్ అయింది. ఈ సినిమా కూడా రీమేక్, అయితే ఒరిజినల్ సినిమాని తెరకెక్కించింది మాత్రం సుధా కొంగర. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది.

ఇకపోతే ఆకాశం నీ హద్దుర సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సుధా కొంగర సూర్యతో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ షల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు ఇదివరకే కథనాలు కూడా వినిపించాయి. ఈ సినిమా గురించి రీసెంట్ టైమ్స్ లో ఎటువంటి అప్డేట్ లేదు అనుకుంటున్న తరుణంలో చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది.

ఈ సినిమా ఇంకొంచెం టైం పడుతుంది ఒక మంచి అవుట్ ఫుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామనేది అధికారిక ప్రకటన యొక్క సారాంశం. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీని కారణం సుధా కొంగర మరియు సూర్య మధ్య కొన్ని అపార్ధాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనివలన ఈ ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది అని విశ్వసినీయ వర్గాల సమాచారం.

- Advertisement -

Dhruv Vikram

ఇక ప్రస్తుతం సుధా కొంగర విక్రమ్ కొడుకు దృవ్ తో ఒక సినిమాను చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాకి రీమేక్ గా తెరకెక్కించిన ఆదిత్య వర్మ సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దృవ్. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించకపోయినా కూడా ధృవకి మాత్రం హీరోగా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మహాన్ సినిమా చేశాడు దృవ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు