Captain Miller : ధనుష్ సినిమాకి UK నుండి జాతీయ అవార్డు?

Captain Miller : కోలీవుడ్ స్టార్ ధనుష్ వరుస సినిమాల్లో దూసుకుపోతుండగా, తాజాగా ధనుష్ నటించిన రీసెంట్ సినిమాకి తాజాగా విదేశాల్లో అవార్డు వరించనుంది. ఈ విషయం నిన్నటి నుండి కోలీవుడ్ లో వైరల్ గా మారింది. అసలు విషయానికి వస్తే… ధ‌నుష్ రీసెంట్ గా న‌టించిన ఓ చిత్రానికి బ్రిటీష్ (ఇంగ్లండ్) సామ్రాజ్యంలో ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్క‌నుంది. రీసెంట్ మూవీ అంటే “కెప్టెన్ మిల్లర్” అని తెలిసిందే. ధనుష్ న‌టించిన కెప్టెన్ మిల్ల‌ర్ సినిమా తాజాగా యుకేలో ప్రీమియ‌ర్ అవుతోంది. నిజానికి ధ‌నుష్ కి అంత‌ర్జాతీయ గుర్తింపు ఇప్పుడే వ‌చ్చిన‌ది కాదు. రస్సో బ్రదర్స్ `ది గ్రే మ్యాన్‌`లో హంతకుడుగా ముఖ్యమైన పాత్రను పోషించినప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. ఈ సినిమా అతడికి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ధనుష్ తన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ అంతర్జాతీయ గుర్తింపును పొందడంతో ఆ పరంపరను కొనసాగించే మార్గంలో ఉన్నాడు.

National award from UK for Dhanush starrer Captain Miller?

బెస్ట్ ఫారిన్ ఫిలిం కేటగిరిలో కెప్టెన్ మిల్లర్!

ఇక ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ UK నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా నామినేట్ అయింది. ఇది ధనుష్ మొత్తం కెప్టెన్ మిల్లర్ టీమ్‌కి ప్రతిష్టాత్మకమైన సమయం. యు ఆర్ నాట్ లోన్లీ: ఫైటింగ్ ది వోల్ఫ్ ప్యాక్ (స్పెయిన్), భక్షక్ (ఇండియా), పరేడ్స్ (జపాన్), రెడ్ ఒల్లెరో: మబుహే ఈజ్ ఎ లై (ఫిలిప్పీన్స్), సిక్స్టీ మినిట్స్ (జర్మనీ), ది హార్ట్‌బ్రేక్ ఏజెన్సీ (జర్మనీ) ఉత్తమ విదేశీ భాషా చిత్రాలుగా UK నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో కెప్టెన్ మిల్లర్‌తో పాటు పోటీప‌డుతున్నాయి. వీటిని పలు విభాగాలలో ధనుష్ సినిమా దాటేసిందని సమాచారం. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ (Captain Miller) తదుపరి దశకు వెళ్లి అవార్డును గెలుచుకుంటాడో లేదో చూడాలి. ఇది ధ‌నుష్ లాంటి స్టార్ కి భారీ అచీవ్‌మెంట్ అవుతుంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన కెప్టెన్ మిల్లర్ లో ధనుష్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, నివేదిత సతీష్, ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ త‌దిత‌రులు న‌టించారు.

- Advertisement -

డీసెంట్ హిట్ అయిన కెప్టెన్ మిల్లర్..

ఇక పీరియాడిక్ డ్రామాగా భారతదేశ చరిత్రలో కీలకమైన అధ్యాయంపై దృష్టి సారించి స్వాతంత్య్రానికి పూర్వం కాలానికి సంబంధించిన క‌థ‌తో ఇది రూపొందింది. ఈ సినిమా కథనం ఒక మిలిటెంట్ చుట్టూ తిరుగుతుంది. అతడు తన గ్రామంలోని ప్రజలను రక్షించడానికి మద్దతు ఇవ్వడానికి బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. ప్రతిఘటన సంఘీభావం నేప‌థ్యంలో కథాంశం ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇక జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ చిత్రం సంగీతానికి మంచి పేరొచ్చింది. జీవీ ప్ర‌కాష్‌ కుమార్ శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి అద‌న‌పు బ‌లం. కెప్టెన్ మిల్లర్ ఈ సంవత్సరం జనవరి 12న విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందింది. రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు