National Awards 2024 : ఒకటి కాదు… 7 నేషనల్ అవార్డ్‌లు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్…

National Awards 2024.. చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అవార్డ్స్ పేరిట బహుకరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నిన్న 70వ జాతీయ చలన చిత్రోత్సవాలకు సంబంధించి ఎవరెవరు ఏ ఏ విభాగంలో జాతీయ అవార్డులు అందుకున్నారు అనే జాబితాను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ మరొకసారి జాతీయ అవార్డును అందుకోవడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా విడుదల చేసిన జాబితాలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ సంగీత విభాగంలో నేషనల్ అవార్డు అందుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఈయన ఏకంగా ఏడవసారి ఈ జాతీయ అవార్డును అందుకోవడం గమనార్హం. అంతేకాదు అత్యధిక జాతీయ అవార్డులు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఆయన రికార్డు సృష్టించారు. మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏ ఏ చిత్రాలకు ఈ అవార్డులు సొంతం చేసుకున్నారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

National Awards 2024 : Not one... 7 National Award winning music director...
National Awards 2024 : Not one… 7 National Award winning music director…

7సార్లు జాతీయ అవార్డులు అందుకున్న ఏఆర్ రెహమాన్..

70వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటనలో భాగంగా తమిళ చిత్రం పొన్నియన్ సెల్వన్ -1 సినిమాకి గానూ బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఏఆర్ రెహమాన్ కి ప్రకటించారు. ఇక దీంతో ఇప్పటివరకు అత్యధిక నేషనల్ అవార్డులు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్గా ఈయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 7 నేషనల్ అవార్డులు అందుకున్న ఈయన మొదటిసారి 1992లో వచ్చిన రోజా సినిమాకి గానూ బెస్ట్ మ్యూజిక్ విభాగంలో మొదటి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1996లో మినసారా కనవు (మెరుపు కలలు) చిత్రానికి, 2001లో లగాన్ సినిమాకు, 2002లో కణ్ణాతిల్ ముత్తమిత్తల్ ( అమృత) చిత్రానికి, 2017లో కాట్రు వెలియడై ( చెలియా) చిత్రానికి, అదే ఏడాదిలో శ్రీదేవి మాం చిత్రానికి కూడా ఈయన నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఇలా మొత్తంగా 7 నేషనల్ అవార్డులు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్గా సరికొత్త రికార్డు సృష్టించారు ఏఆర్ రెహమాన్. ఇకపోతే ఈ ఏడు అవార్డులలో ఐదు చిత్రాలు బెస్ట్ మ్యూజిక్ విభాగంలో , మామ్, పొన్నియిన్ సెల్వన్ -1 బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విభాగాలలో నేషనల్ అవార్డులు లభించాయి.

2 హిందీ సినిమాలు , 5 తమిళ్ సినిమాలు..

ఇకపోతే ఈ అవార్డులలో రెండు హిందీ సినిమాలు , ఐదు తమిళ్ సినిమాలు కావడం గమనార్హం. ఇకపోతే ఇప్పటివరకు అత్యధిక నేషనల్ అవార్డులు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్గా ఈయన చరిత్ర సృష్టించారు . అయితే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పేరు సొంతం చేసుకున్న ఇళయరాజా ఐదుసార్లు , విశాల్ భరద్వాజ్ నాలుగు సార్లు ఈ అవార్డ్ గెలుచుకొని ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి ఒక్క జాతీయ అవార్డు అందుకోవడానికి హీరోలు హీరోయిన్లు మిగతా విభాగాల వారు తెగ కుస్తీలు పడుతుంటే , ఈయన మాత్రం అవలీలగా ఏడు సార్లు అందుకొని అందరిని ఆశ్చర్యపరిచినారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు