National Film Awards : అవార్డ్స్ వచ్చేశాయి

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అవార్డులు 68వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేసింది. సూరరై పొట్రు మరియు తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్ సినిమాలకు సూర్య, అజయ్ దేవగన్ ఉత్తమ నటుడి అవార్డులను అందుకున్నారు. ఉత్తమ నటుడుగా అవార్డు అందుకోవడం అజయ్ దేవగన్‌కి ఇది మూడోసారి. గతంలో జఖ్మ్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ సినిమాలకు గాను అజయ్ దేవగన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు.

సూరరై పొట్రు చిత్రానికి గాను అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా అవార్డు తీసుకుంది. వీటితో పాటు ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ చలనచిత్రం అవార్డులను కూడా సూరరై పొట్రునే గెలుచుకుంది. అలాగే ఉత్తమ సంగీ దర్శకుడిగా ఎస్ ఎస్ థమన్ అవార్డును అందుకున్నాడు. అల వైకుంఠపురములో అనే సినిమాకు గాను థమన్ కు ఈ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో ఈ అవార్డును తీసుకుంది. దీంతో పాటు ఈ కార్యక్రమంలో అవార్డులను అందుకున్న వాళ్ల లిస్ట్..

ఫీచర్ సినిమాలు :

- Advertisement -
  • ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ : సూరరై పొట్రు
  • ఉత్తమ దర్శకత్వం : సచి (అయ్యప్పనుమ్ కోషియుమ్)
  • ఉత్తమ నటి : అపర్ణా బాలమురళి (సూరరై పొట్రు)
  • ఉత్తమ నటుడు : సూర్య (సూరరై పొట్రు), అజయ్ దేవగన్ (తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్)
  • ఉత్తమ సహాయ నటి : లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుమ్ ఇన్నుమ్ సిల పెంగళం)
  • ఉత్తమ సహాయ నటుడు : బిజు మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్)
  • ఉత్తమ తెలుగు చిత్రం : కలర్ ఫోటో
  • ఉత్తమ తమిళ చిత్రం : శివరంజనియుమ్ ఇన్నుమ్ సిల పెంగల్లుమ్
  • ఉత్తమ మలయాళ చిత్రం : తింకలఙ్చ నిశ్చయం
  • ఉత్తమ మరాఠీ చిత్రం : గోష్ట ఎకా పైతానిచి
  • ఉత్తమ కన్నడ చిత్రం : డొల్లు
  • ఉత్తమ హిందీ చిత్రం : టూల్‌సిదాస్ జూనియర్
  • ఉత్తమ బెంగాలీ చిత్రం : అవిజాట్రిక్
  • ఉత్తమ అస్సామీ చిత్రం : బ్రిడ్జ్
  • ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ : అయ్యప్పనుమ్ కోషియుమ్
  • ఉత్తమ కొరియోగ్రఫీ : నాట్యం (తెలుగు)
  • ఉత్తమ సాహిత్యం : సైనా
  • ఉత్తమ సంగీత దర్శకత్వం : థమన్ ఎస్ ఎస్ (అలా వైకుంఠపురములో)
  • ఉత్తమ నేపథ్య సంగీతం : సూరరై పొట్రు
  • బెస్ట్ మేకప్ : నాట్యం
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : కప్పెల
  • ఉత్తమ ఎడిటింగ్ : శివరంజనియుమ్ ఇన్నుమ్ సిల పెంగళ్లుమ్
  • ఉత్తమ ఆడియోగ్రఫీ : డొల్లు
  • ఉత్తమ స్క్రీన్ ప్లే : సూరరై పొట్రు
  • ఉత్తమ సంభాషణ రచయిత : మండేలా
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ : అవిజాత్రిక్ (ది వాండర్లస్ట్ ఆఫ్ అపు)
  • ఉత్తమ నేపథ్య గాయని : నాంచమ్మ (అయ్యప్పనుమ్ కోషియుమ్)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు : రాహుల్ దేశ్‌పాండే, ఎంఐ వసంతరావు

నాన్-ఫీచర్ సినిమాలు :

  • ఉత్తమ కథనం: రాప్సోడి ఆఫ్ రెయిన్స్ – మాన్‌సూన్స్ ఆఫ్ కేరళ
  • ఉత్తమ ఎడిటింగ్ : బోర్డర్‌ల్యాండ్స్
  • ఉత్తమ ఆడియోగ్రఫీ : డొల్లు
  • ఉత్తమ ఆన్-లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్ : మ్యాజికల్ ఫారెస్ట్
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ : శబ్దికున్న కాళప్ప
  • ఉత్తమ దర్శకత్వం : ఓ దట్స్ భాను
  • కుటుంబ విలువలపై ఉత్తమ చిత్రం : కుంకుమార్చన
  • ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిల్మ్ : కాచిచినీతు
  • ప్రత్యేక జ్యూరీ అవార్డు : అంగీకరించబడింది
  • ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం : ది సేవియర్: బ్రిగ్. ప్రీతమ్ సింగ్
  • ఉత్తమ అన్వేషణ చిత్రం : వీలింగ్ ది బాల్
  • ఉత్తమ ఎడ్యుకేషన్ ఫిల్మ్ : డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్
  • ఉత్తమ జీవిత చరిత్ర చిత్రం : పబుంగ్ శ్యామ్
  • ఉత్తమ ఎథ్నోగ్రాఫిక్ చిత్రం : మండల్ కే బోల్
  • ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ : టెస్టిమోనీ ఆఫ్ అనా

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు