Naveen Chandra: కేఫ్ నుండీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్.. సక్సెస్ వెనుక కష్టం ఎంతో..?

Naveen Chandra: నవీన్ చంద్ర.. మంచి కటౌట్.. అంతకు మించి హ్యాండ్సమ్ లుక్.. ఇలా ఒక్కటేమిటి ఈయనలోని ప్రతి అంశం కూడా అమ్మాయిలకు గిలిగింతలు పెడుతుంది అనడంలో సందేహం లేదు.. అందుకే అందాల రాక్షసి సినిమా కోసం హీరోలను వెతుకుతున్న సమయంలో ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి ఇతడిని అందాల రాక్షసి సినిమాలో హీరోగా తీసుకున్నారు.. ఈ సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర జర్నీ గురించి అందరికీ తెలిసిందే.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన కొన్ని.
సినిమాలకు మాత్రమే హీరోగా పరిమితమయ్యాడు అటు పై అతడి జర్నీ మరోలా టర్నింగ్ తీసుకుంది.. హీరోగా ఫెయిల్ అవ్వడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూ టర్న్ తీసుకున్నారు నవీన్ చంద్ర..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్..

Naveen Chandra: Dadasaheb Phalke Award from Cafe.. How much difficulty is behind the success..?
Naveen Chandra: Dadasaheb Phalke Award from Cafe.. How much difficulty is behind the success..?

హీరోగా సక్సెస్ కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఇప్పుడు మంచి అవకాశాలు అందుకుంటున్నాడు కూడా.. అయితే నవీన్ చంద్ర హీరోగా సక్సెస్ అవ్వడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నా సక్సెస్ కాకపోవడానికి కూడా పలు కారణాలు ఉన్నాయని సమాచారం.. ముఖ్యంగా నవీన్ జర్నీ ట్రాక్ తప్పడానికి అతడి వ్యవహార శైలి కూడా ఒక కారణమని.. గతంలో ఎన్నోసార్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయినా అదంతా గతం.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం బాగానే బిజీగా దూసుకుపోతున్నారు నవీన్ చంద్ర.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ చంద్ర తన గురించి కొన్ని విషయాలను రివీల్ చేశారు..

కెఫే లో పనిచేశా..

మొదటి నుంచి నాకు డాన్స్ పైన చాలా ఇష్టం ఉండేది… బళ్లారిలో నేను డాన్స్ వేస్తే.. ఆ షోస్ చూడడానికి జనాలు భారీగా వచ్చేవారు.. దాంతో నా దృష్టి సినిమాల వైపు వెళ్ళింది. ఇండస్ట్రీలో నాకు తెలిసిన వారు ఎవరు లేరు. ఇక్కడ నిలబడే వరకు ఒక ఇన్కమ్ అనేది నాకు అవసరం.. అందువల్ల కెఫే లో, బిర్యాని సెంటర్లో కూడా పనిచేశాను.. డైలీ కలెక్షన్లు చూసుకొని పని కూడా చేశాను .. సినిమాల దిశగా రావడానికి ఇక్కడ నిలువు దక్కించుకోవడానికి కొంత సమయం పట్టింది.. ఒకవేళ ఇంకాస్త ముందుగా వచ్చి ఉంటే నా కెరియర్ ఇంతకంటే బెటర్ గా ఉండేదేమో..

- Advertisement -

వారే నా స్ఫూర్తి..

సమయం ఉన్నప్పుడు నేను పాత సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటాను.. ముఖ్యంగా రమణారెడ్డి, సూర్యకాంతం, రేలంగి వంటి అగ్ర నటుల నటన అంటే నాకు చాలా ఇష్టం.. వాళ్ళ సినిమాలు సమయం దొరికినప్పుడు చూస్తూ ఉంటాను.. ముఖ్యంగా అప్పటి నిజ జీవితాలకు వారు తీసిన సినిమాలు వాస్తవ రూపాలు.. ఇక నాడు కెఫెలో పని చేశాను కాబట్టి నేడు ఈ స్థితిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు నవీన్ చంద్ర.. ఇటీవల నవీన్ చంద్ర కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికైతే నవీన్ చంద్ర సక్సెస్ఫుల్ స్టోరీ విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు… ఏది ఏమైనా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అంటే ఆ మాత్రం కష్టం తప్పదు అని నెటిజన్స్ నవీన్ కు అండగా నిలుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు