Naveen Polishetty : పాపం నవీన్‌కి ఎలాంటి పరిస్థితి వచ్చింది…  చేయి విరిగినా కానీ కామెడీ మాత్రం ఆపలేదు..!

Naveen polishetty.. స్టాండప్ కమెడియన్ గా కెరియర్ మొదలు పెట్టిన నవీన్ పోలిశెట్టి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు చిత్రాలలో నటించి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మినిమం గ్యారెంటీ హీరోగా , మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోగా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న నవీన్ పోలిశెట్టి ఇటీవలే ఏడాది జనవరిలో అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పట్లో అది చిన్న గాయమని అందరూ అనుకున్నారు.. కానీ చేతికి పలుచోట్ల ఫ్రాక్చర్ అయ్యాయని.. అవి తగ్గిపోయే ఉంటాయని.. ఇంకా ఎందుకు సినిమాల్లోకి రావడం లేదు.. అంటూ రకరకాల ప్రశ్నలు కూడా గుప్పించారు అభిమానులు.

Naveen Polishetty : Unfortunately what happened to Naveen... But comedy didn't stop even if his arm was broken..!
Naveen Polishetty : Unfortunately what happened to Naveen… But comedy didn’t stop even if his arm was broken..!

చెయ్యి విరిగి తంటాలు పడుతున్న నవీన్ పోలిశెట్టి..

అయితే గత రెండు నెలల క్రితం అసలు విషయాన్ని పంచుకున్నారు నవీన్ పోలిశెట్టి.. కుడి చేతిలో పలుచోట్ల ఫ్రాక్చర్ జరిగాయి. నా కుడి కాలికి కూడా గాయం అయింది . నాకు చాలా కష్టంగా ఉంది. బాధగా కూడా ఉంది. మరీ ముఖ్యంగా సినిమాలకు ఇంత దూరం ఉండడం భరించలేకపోతున్నాను. తప్పకుండా త్వరలోనే మీ అందరిని పలకరిస్తాను అంటూ తెలిపాడు.

చెయ్యి విరిగినా కామెడీ మాత్రం ఆపడం లేదు..

అయితే తాజాగా ఇప్పుడు త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ ఒక వీడియో తన X ఖాతా ద్వారా పంచుకున్నారు నవీన్ పోలిశెట్టి. కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడే అనే బాధ అభిమానులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇలా ఒక వీడియో ఫన్నీగా చేసి అందరిని నవ్వించారు. ప్రస్తుతం ఒక చేతితో తాను పడుతున్న కష్టాలను ఫన్నీగా చూపించి , ఆకట్టుకునే ప్రయత్నం చేశారు నవీన్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి పంచుకున్న వీడియోలో ఒక చేతితో పనులు చేయలేక, ఇతరులతో మాటలు పడలేక ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే కచ్చితంగా నవ్వొస్తుంది. ఇక చివర్లో జీవితంలో సమస్యలతో పోరాడడానికి హాస్యం అనేది ఎంతో నేర్పిస్తుంది. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి.. మిమ్మల్ని నవ్వించడం అంటే నాకు చాలా ఇష్టం. త్వరలోనే పెద్ద స్క్రీన్ పై మళ్లీ కలుద్దాం. త్వరలో పూర్తిగా కోలుకొని కొత్త సినిమాలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.. మీ దోస్త్ నవీన్ పోలిశెట్టి అంటూ ఒక వీడియో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వీడియో చూసిన అభిమానులంతా కూడా ఒక చేయి ఫ్రాక్చర్ అయినా పాపం నవీన్ పరిస్థితి ఎంతలా మారిపోయిందో అంటూ నిట్టూరుస్తున్నారు. మరికొంతమంది చెయ్యి విరిగినా సరే కామెడీ మాత్రం ఆపడం లేదు.. నిజంగా గ్రేట్ గురూ అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

నవీన్ పోలిశెట్టి సినిమాలు..

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన త్వరలోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం చేయి విరిగిన కారణంగా సినిమా కథలు వింటున్న నవీన్ పోలీస్ శెట్టి త్వరలోనే ఫుల్ ఎనర్జిటిక్ తో ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు