Naveen Polishetty: ఇంత జరిగినా చెప్పలేదు ఏంటి మావా, సంగారెడ్డి ఆగం అయ్యేది రా జానే జిగర్

Naveen Polishetty: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కొన్ని పాత్రలో కనిపించిన నవీన్. ఆ తర్వాత తెలుగు ఫిలిమ్స్ కి కొన్ని ఏళ్లపాటు గ్యాప్ ఇచ్చి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఎక్కడిదో ఒక్కసారిగా నవీన్ పోలిశెట్టి ఫేమస్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత నవీన్ చేసిన సినిమా జాతి రత్నాలు. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది.

ఈ సినిమా తర్వాత మిస్టర్ శెట్టి మెసేజ్ పోలిశెట్టి అనే సినిమాను చేశాడు నవీన్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. నవీన్ ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నవీన్ కొంత టైం తీసుకున్న కూడా క్వాలిటీ ఫిలిమ్స్ చేస్తాడు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. నవీన్ పోలిశెట్టి ఒక సినిమాకి సైన్ చేశాడు అని అంటే ఏమీ ఆలోచించకుండా సినిమాకి వెళ్లిపోవచ్చు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక ప్రస్తుతం నవీన్ నుంచి ఒక సినిమా అప్డేట్ కూడా రాలేదనుకునే టైంలో తన హెల్త్ అప్డేట్ ఇచ్చాడు నవీన్ అసలు నవీన్ కి ఏమైంది.?

Naveen Polishetty

- Advertisement -

హెల్త్ అప్డేట్

ఈ రోజు మీతో నేనొక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ, నాకు చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, కాలికి కూడా ఇంజురీ అయ్యింది. ఇది నాకు చాలా టఫ్ అండ్ పెయిన్ ఫుల్ టైమ్. ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్ లో. ఈ ఇంజురీ వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు నా ఫిలిమ్స్ తీసుకురాలేకపోతున్నందుకు సారీ.

గత కొన్ని రోజులు చాలా టఫ్ గా గడిచాయి. నేను కంప్లీట్ గా రికవర్ అయ్యి, మీకు నా బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్ ని చూపించడానికి మెడికల్ ప్రొఫెషనల్స్ సహాయంతో వర్క్ చేస్తున్నాను. కానీ దానికి కొన్ని నెలలు టైమ్ పడుతుంది. నేను ముందు కంటే స్ట్రాంగ్ గా, హెల్తీ గా కమ్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను.

గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న నా అప్ కమింగ్ ఫిలిమ్ స్క్రిప్ట్ అధ్బుతంగా, మీకు బాగా నచ్చే విధంగా రూపు దిద్దుకుంటున్నాయి. నేను పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ మొదలుపెడతాను. మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ యే నాకు అన్నీ. నేను తిరిగి మీ ముందుకు రావాలన్న ఆశకి అవే మోటివేషన్. మీ సపోర్ట్ కీ, పేషన్స్ కీ చాలా థాంక్స్. అతి త్వరలో నేను మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మీరు ఎప్పటిలాగే నా మీద మీ ప్రేమని కురిపించడానికి సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను…

లవ్,
మీ జానేజిగర్.

ఈ విషయాన్ని అంతటినీ రాసుకొస్తే ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు