Navin Pauly : ప్రేమమ్ హీరో ధైర్యానికి ఆ ఒక్క ప్రూఫే కారణమా? లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్

Navin Pauly : దుబాయ్‌లో ఏడాది క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 40 ఏళ్ల మహిళ చేసిన ఫిర్యాదుపై ప్రేమమ్ నటుడు నివిన్ పౌలీపై అత్యాచారం నేరం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను ఆయన ఖండించాడు. తాజాగా ఈ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నివిన్ అంత ధైర్యంగా ఆరోపణలను తోసి పుచ్చడానికి కారణం ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

ప్రేమమ్ హీరో ధైర్యానికి ఆ ఒక్క ప్రూఫే కారణమా?

తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలను కొట్టిపారేస్తూ నివిన్ సాధ్యమైన చట్టపరమైన చర్యలను తీసుకుంటానని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని శపథం చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కొన్ని గంటల తర్వాత, పౌలీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో “ఈ ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. బాధ్యులను వెలుగులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాను. మీ ఆందోళనకు ధన్యవాదాలు. మిగిలిన వాటిని చట్టబద్ధంగా నిర్వహిస్తాము” అని ఆయన అన్నారు. అనంతరం అతను ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ “ఇది ఉద్దేశపూర్వక ఆరోపణ. దీని వెనుక కుట్ర ఉందని నేను నమ్ముతున్నాను” అన్నారు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి తనకు తెలియదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని, మాట్లాడలేదని చెప్పాడు. అలాంటి తప్పుడు ఆరోపణలకు మనం అడ్డుకట్ట వేయాలి” అని నమ్ముతున్నందున చివరి వరకు పోరాడతానని చెప్పారు. నేను నా కోసం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎదుర్కొనే ఇతరుల కోసం పోరాడతాను” అని అతను చెప్పాడు. తన పరువు తీయడానికి ప్రయత్నించినందుకు ఫిర్యాదుదారుడిపై కేసు పెడతానని, ఫిర్యాదును సిద్ధం చేస్తున్నట్లు నటుడు తెలిపారు. తాను విచారణకు సహకరిస్తానని, ఆ ఆరోపణలను ప్రచారం చేసే ముందు వాటి వెనుక ఉన్న వాస్తవాలు లేదా నిజానిజాలను నిర్ధారించాలని మీడియాను అభ్యర్థించారు. “ఇలాంటి ఆరోపణలు మా సన్నిహిత కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. నా కుటుంబం మద్దతు నాకు ఉంది” అని అతను చెప్పాడు.

ఆ తరువాత కంప్లయింట్ చేసిన మహిళ మాట్లాడుతూ “అన్ని ఆధారాలు ఉన్న నా ఫోన్ తన వద్ద ఉంది. అందుకే అతను తనకు నేను తెలియదని, తాను ఏమీ చేయలేదని నమ్మకంగా చెబుతున్నాడు. న్యాయం కోసం ఎంతటికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని అన్నారు. జస్టిస్ కె హేమ కమిటీ నివేదికను ప్రచురించిన తర్వాత మహిళా నటీనటులు లైంగిక వేధింపులు లేదా అత్యాచారం ఆరోపణలను ఎదుర్కొంటున్న అనేక మంది నటులు, దర్శకులలో పౌలీ కూడా ఉన్నారు. అయితే నిజం ఏంటో తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేదాకా ఆగాల్సిందే.

- Advertisement -

Nivin Pauly's net worth, income, career, success, awards, family and more

అసలు వివాదం ఇదే

2017 నటిపై దాడి కేసు, మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, దోపిడీకి సంబంధించిన ఉదంతాలను వెల్లడి చేసిన నివేదిక తర్వాత కేరళ ప్రభుత్వం ఈ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. పలువురు నటీనటులు, దర్శకులపై లైంగిక వేధింపులు మరియు దోపిడీ ఆరోపణల నేపథ్యంలో, వారిని విచారించడానికి ఏడుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆగస్టు 25న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మంగళవారం ఐపీసీ సెక్షన్ 376 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఊన్నుకల్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ కేసులో ఒక మహిళతో సహా ఆరుగురు నిందితులు ఉన్నారని తెలిపారు. మొదటి ముద్దాయి మహిళ కాగా, పౌలీ ఆరో నిందితుడు అని అధికారి తెలిపారు. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితం దుబాయ్‌లో ఈ ఘటన జరిగింది. మీడియాతో ఆమె మాట్లాడుతూ నేను దుబాయ్‌లోని ఒక హోటల్‌లో అతనితో (నిర్మాత ఎకె సునీల్) ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. అక్కడ అతను నన్ను లైంగికంగా వేధించాడు. నటుడు నివిన్ పౌలీ, బిను, బషీర్, కుట్టన్-ఈ గూండాలు వచ్చారు. నన్ను మూడు రోజుల పాటు గదిలో బంధించి దాడి చేశారు అని వెల్లడించింది. తాను దుబాయ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయితే సాక్ష్యాలు లేకపోవడంతో కేసు కొనసాగించలేదని ఆమె పేర్కొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు