Nawazuddin siddhiqui brother arrested : ఫోర్జరీ కేసులో బాలీవుడ్ స్టార్ బ్రదర్ అరెస్ట్

Nawazuddin siddhiqui brother arrested : బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరుడు అరెస్ట్ అయ్యాడన్న వార్త బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ అతను చేసిన తప్పేంటి? అనే విషయంలోకి వెళ్తే..

అయాజుద్దీన్ అరెస్ట్..

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నయ్య అయాజుద్దీన్ అరెస్ట్ అయ్యారు. సమాచారం ప్రకారం నవాజుద్దీన్ సోదరుడిని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో బుధానా పోలీసులు బుధవారం, మే 22న కస్టడీలోకి తీసుకున్నారు. ఫోర్జరీ కేసులో అతన్ని అరెస్టు చేశారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరుడిని ఎందుకు అరెస్టు చేశారు?

తాజా సమాచారం ప్రకారం నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరుడు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు చేసినట్టుగా ఏకీకరణ విభాగానికి (కన్సోలిడేషన్ డిపార్ట్మెంట్) చట్టవిరుద్ధంగా ఓ ఉత్తర్వు లేఖను జారీ చేశారు. జావేద్ ఇక్బాల్ అనే వ్యక్తితో కొనసాగుతున్న వ్యవసాయ భూమి వివాదానికి సంబంధించిన కేసులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే జారీ చేసిన ఉత్తర్వు నకిలీదని తర్వాత తేలింది. దీంతో జిల్లా మేజిస్ట్రేట్ ఫిర్యాదు మేరకు అయాజుద్దీన్‌పై 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

అయాజుద్దీన్ కు వివాదాలు కొత్తేమీ కాదు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరుడు కష్టాల్లో పడడం ఇదే తొలిసారి కాదు. 2018లో అయాజుద్దీన్ సిద్ధిఖీ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన ఫోటోను షేర్ చేయడం ద్వారా మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీశారనే వివాదంలో చుకకుకున్నారు.

Nawazuddin Siddiqui united with wife Aaliya and kids in Dubai on New Year's  Eve – Exclusive | Hindi Movie News - Times of India

నవాజుద్దీన్ సిద్ధిఖీ విడాకులు

నవాజుద్దీన్ సిద్ధిఖీ తన భార్య ఆలియా సిద్ధిఖీ నుండి విడాకులు తీసుకోబోతోందని వార్తలు వచ్చాయి. మే 2020లో ఆలియా నవాజుద్దీన్ కు వాట్సాప్, ఇమెయిల్ ద్వారా విడాకుల నోటీసు పంపింది. వారి వివాహ బంధం పదేళ్లుగా సమస్యాత్మకంగా ఉందని ఆమె ఆరోపించింది. నవాజుద్దీన్ సోదరుడు షమాస్‌పై కూడా అలియా హింసాత్మక ఆరోపణలు చేసింది.

అయితే ఆ తరువాత కొంత కాలానికే ఆలియా ఇటీవల తన విడాకుల నోటీసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. నవాజుద్దీన్‌తో రాజీపడాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. దానికి సంబంధించి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడింది కూడా.

భర్తతో ఆలియా రాజీ…

ఆలియా మాట్లాడుతూ “ఇటీవల కాలంలో నా జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి. మనం లోకంతో చెడు విషయాలను పంచుకున్నప్పుడు, మంచి వాటిని కూడా పంచుకోవాలని నాకు అనిపించింది. ఏది మంచిదో కూడా చూడాలని నా అభిప్రాయం. నవాజ్ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి మేము పిల్లలతో వార్షికోత్సవాన్ని జరుపుకున్నాము.

మా రిలేషన్ లో మేము ఎదుర్కొన్న సమస్య ఎప్పుడూ మూడవ వ్యక్తి వల్లనే అని నేను భావిస్తున్నాను. కానీ ఇప్పుడు ఆ అపార్థం మా జీవితాల్లోంచి పోయింది. మా పిల్లల కారణంగా, మేము పూర్తిగా మారిపోయాము. ఇప్పుడు జీవితంలో వేరుగా ఉండే అవకాశం లేదు, ఎందుకంటే పిల్లలు కూడా పెరుగుతున్నారు. కాబట్టి మేము ఇకపై గొడవలు పడకుండా, శాంతియుతంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాము” అని ఆలియా ఓ నేషనల్ మీడియాతో చెప్పుకొచ్చింది.

అయితే నవాజుద్దీన్ లైఫ్ సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలవడం ఆయన అభిమానులను ఇబ్బంది పెడుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు