Nayanatara: నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే..?

Nayanatara.. సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార దాదాపు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 19 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని.. మరింత బిజీగా మారిపోయింది. ఒకవైపు సౌత్ భాషా చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నయనతార.. అటు ఈ మధ్యకాలంలో బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టి వరుస సినిమాలు చేస్తూ అక్కడ కూడా స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయింది.. ఇక ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నయనతార.. తాజాగా ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.. అదేమిటంటే ఆమె ఆ హీరోతో పని చేయడమే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అంటూ చెప్పుకొచ్చింది.. మరి నయనతార ఏ హీరోని ఉద్దేశించి.. ఎందుకు కామెంట్లు చేసిందో ..? ఇప్పుడు చూద్దాం..

సూర్య నటించిన గజినీ చిత్రం.. నా జీవితంలో చెత్త నిర్ణయం..

Nayanatara: That was the biggest mistake I made in my life..?
Nayanatara: That was the biggest mistake I made in my life..?

హీరో సూర్య నటించిన గజినీ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో ఆసిన్ , నయనతార ఇద్దరూ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కానీ ఎందుకో నయనతార మాత్రం ఈ సినిమాలో నటించినందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తెగ బాధ పడిపోతోంది.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార మాట్లాడుతూ.. సూర్య నటించిన గజినీ చిత్రంలో నేను నటించడమే నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం.. ఈ సినిమా కథా కథనం విషయానికి వస్తే.. ఈ సినిమా స్టోరీ చెప్పేటప్పుడు ఒకలా చెప్పారు.. ఆ తర్వాత సినిమాలో నా పాత్ర మరోలా చిత్రీకరించారు.. కొన్ని చోట్ల నన్ను చాలా చెడుగా చిత్రీకరించి చూపించారు.. అయితే ఈ విషయంపై నేను ఎక్కువగా ఫిర్యాదు చేయాలనుకోవట్లేదు … ఎందుకంటే నేను ఈ అనుభవాన్ని నా జీవితంలో ఒక అభ్యాస అనుభవంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది నయనతార..

నయనతార అసంతృప్తి పై డైరెక్టర్ కామెంట్…

తాజాగా నయనతార గజినీ సినిమాలో తన పాత్ర పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ స్పందించారు.. నేను ఒక వ్యక్తిని ఇష్టపడినంత మాత్రాన ఆ వ్యక్తికి ఆ సినిమాలో పాత్రను విస్తరించలేను… ఒకవేళ ఆ వ్యక్తి నాకు నచ్చకపోతే ఆ సినిమాలో వారి పాత్ర తక్కువగా చేసి చూపించలేను.. ఒక్కోసారి మనకు నచ్చని నటీనటులకు కూడా మంచి పాత్రలు ఇవ్వాల్సి వస్తుంది. ఇష్టమైన వారికి చిన్న పాత్ర కూడా లభించి ఉండవచ్చు.. అది మన చేతుల్లో లేదు కదా.. కథ కథనం బట్టి ఉంటుంది.. ఈ విషయంలో నయనతార అసంతృప్తి వ్యక్తం చేయడం నా చేతుల్లో ఏమీ లేదు అంటూ మురగదాస్ చెప్పుకొచ్చారు.. మొత్తానికి అయితే గజినీ సినిమాలో తన పాత్ర తలుచుకొని ఇప్పుడు బాధపడుతోంది నయనతార.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు నయనతార కి కూడా మంచి పేరే వచ్చింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ సౌత్ లో ఏకంగా రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ హైయెస్ట్ పారితోషకం అందుకుంటున్న హీరోయిన్గా నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు