Nayanthara : ఆయన నాకు తండ్రిలా

స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2003లో మలయాళం చిత్రంతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నయనతార ఆ తర్వాత సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందింది. హర్రర్ థ్రిల్లర్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నయనతార తాజాగా మరోసారి కనెక్ట్ అనే చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తుంది.

గతంలో నయనతారతో మాయ (తెలుగులో మయూరి), తాప్సి తో గేమ్ ఓవర్, సినిమాలు రూపొందించిన అశ్విన్ శరవన్.. ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ గా తిరిగి ఎక్కుతున్న ఈ సినిమాలో వాన ఫెమ్ వినయ్, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాని రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార స్వయంగా నిర్మిస్తుంది.

తెలుగులో యువి క్రియేషన్స్ ఈ సినిమాని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నయనతార బాహుబలి లో కట్టప్ప పాత్ర చేసిన సత్యరాజ్ పై ఎమోషనల్ కామెంట్ చేసింది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే రాజా రాణి సినిమాలో తండ్రి కూతురుగా నటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇప్పుడు కనెక్ట్ సినిమాలో కూడా వీరు తండ్రి కూతుర్లుగా నటిస్తున్నారు. అయితే సత్యరాజ్ ని చూస్తే తనకు తండ్రి లాంటి ఫీలింగ్ వస్తుందని నయనతార ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అచ్చం తన తండ్రిలాగే అనిపిస్తుందని చెప్పింది. ఇక విరామం లేకుండా వస్తున్న ఈ కనెక్ట్ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు