Nayanthara : ఇదేంది సామి… స్టార్ హీరోయిన్‌ని హాగ్ చేసుకొని రచ్చ చేస్తున్న నయన్…

Nayanthara : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నటువంటి నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. రీసెంట్ గానే జవాన్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరిలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా నయనతార మొదటి స్థానంలో ఉన్నారు. నయనతార ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తూ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. నయనతార కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు వున్నారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నయనతార సినిమాలు చేస్తూనే మరోవైపు తన ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది.

ఈ బ్యూటీ మొదటగా మలయాళం ఇండస్ట్రీలో తన కెరియర్ ప్రారంభించి…. ఆ తర్వాత సౌత్ లోని అన్ని భాషల్లో నటించింది. తన అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకుంది నయనతార. స్టార్ హీరోలందరి సరసన జతకట్టి అగ్ర హీరోయిన్గా నిలిచింది. ప్రస్తుతం నయనతార లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటుంది. ఎప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే నయనతార ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

- Advertisement -

Image
తనకు సంబంధించిన విషయాలను, పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నయనతార స్టార్ హీరోయిన్ నజ్రియాతో కలిసి కొన్ని ఫోటోలను దిగారు. ఈ ఫోటోలను తాజాగా నయనతార తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో నయనతార, నజ్రియా ఇద్దరూ కూడా వైట్ కలర్ డ్రెస్ ధరించి చాలా క్లోజ్ గా ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఏంటి వీరిద్దరూ ఇంత క్లోజ్ గా హగ్ చేసుకున్నారేంటి అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు