Nayanthara: నయనతార సినిమాకు కథను అందిస్తున్న ప్రముఖ సినీ జర్నలిస్ట్

Nayanthara: హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోలు సరసం నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది నయనతార. అయితే ఒకప్పుడు టాప్ హీరోహిన్ గా కొనసాగిన నయనతార రీసెంట్ డేస్ లో లేడీస్ సూపర్ స్టార్ గా పేర్లు సాధించుకుంది. నయనతార చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాలుగా నిలిచాయి. రీసెంట్ లో నయనతార రెమ్యూనరేషన్ కూడా పీక్ క్రేజీలో పెరిగిపోయింది. నయనతార ఒక సినిమా చేస్తుందంటే ఆ సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోతాయి.

నయనతార లేడీ ఓరియంటెడ్ గా చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాలను సాధించాయి. ఇక రీసెంట్గా దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది నయనతార. నేను రౌడీ దానే అనే సినిమాకి దర్శకత్వం వహించాడు విగ్నేష్ శివన్. అక్కడితో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడే అది ప్రేమగా మారింది. అయితే నయనతార ఇంతకుముందు ఎంతమందితో ప్రేమలో పడినా కూడా విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడిపి ఏడడుగులు బంధం వరకు కొనసాగింది. ప్రస్తుతం వీరిద్దరికి ట్విన్స్ కూడా ఉన్నారు.

Nayanathara

- Advertisement -

ఇకపోతే వరుసగా కెరియర్ ఫుల్ బిజీగా ఉంది నయనతార. కెవిన్ హీరోగా చేస్తున్న ఒక సినిమాలో నయనతార నటిస్తుంది. ఇక రీసెంట్ గా నయనతార ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐరా అనే సినిమాకి దర్శకత్వం వహించిన సర్జున్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి ప్రముఖ సినిమా జర్నలిస్ట్ భరద్వాజ రంగన్ కథను అందిస్తున్నారు. అయితే ఎన్నో సినిమాలకు తనదైన శైలిలో రివ్యూస్ ఇచ్చిన భరద్వాజ్ రంగన్ ఒక సినిమాకి కథను అందిస్తున్నాడు అంటే క్యూరియాసిటీ వేరే రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు