Nayan- Vignesh: బియాండ్ ది ఫెయిర్ టేల్

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్ నయ‌న‌తార గురించి తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. ముఖ్యంగా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఆమె సినిమాల‌ను ఎక్కువ‌గా చేస్తోంది. ఇటీవ‌ల బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాల్లో న‌టించింది. స్టార్ హీరోల‌కు ధీటుగా స్టార్ స్టేట‌స్ ని సంపాదించుకుంది. ఈమె వ‌రుస లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌ను చేస్తూ దూసుకెళ్తుంది. లేడీ సూప‌ర్ స్టార్‌గా అభిమానుల చేత పిలిపించుకుంటూ స్టార్ హీరోల‌కే పోటీగా నిలుస్తుంది.

ఇటీవ‌లే ఈమె పెళ్లీ పీట‌లు సినిమాలో న‌టించిన విష‌యం విధిత‌మే. కోలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌, న‌య‌న‌తార ప్రేమించుకుని ఇటీవ‌లే పెళ్లితో ఒక్క‌ట‌య్యారు. వీరి పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. పెళ్లి వేడుక‌ను సినిమాటిక్ రేంజ్లో గౌత‌మ్ మీన‌న్ షూట్ చేశారు. వీరి పెళ్లి వేడుక సంబంధించిన వీడియోను తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంట‌రీ రూపంలో తీసుకురాబోతుంది. ఆ డాక్యుమెంటరికీ సంబంధించిన టీజ‌ర్ ను నెట్‌ఫ్లిక్స్ విడుద‌ల చేయ‌నుంది.

న‌య‌న‌తార బియాండ్ ది ఫెయిర్ టేల్ అనే పేరుతో గౌత‌మ్ మీన‌న్ డాక్యుమెంట‌రీ రూపొందించారు. ఇందుకు సంబంధించిన టీజ‌ర్‌ను తాజాగా రిలీజ్ చేసి త్వ‌ర‌లోనే రాబోతుందంటూ తెలిపారు. ఈ వీడియో చూసిన వారంద‌రూ ఇది పెళ్లి వీడియో కాదు.. అంత‌కు మించి ఉంద‌ని కామెంట్లు చేస్తున్నారు. ఈ డాక్యుమెంట‌రీలో పెళ్లితో పాటు వీరి ప‌రిచ‌యం, జ్క్షాప‌కాలు, కెరీర్ వంటి అన్నింటినీ చూపించ‌బోతున్నార‌ని స‌మాచారం. ఈ పెళ్లి వేడుక డిజిట‌ల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్‌ రూ.25కోట్లు చెల్లించిన‌ట్టు స‌మాచారం. ఈ డాక్యుమెంట‌రీ ప్రేక్ష‌కుల ముందుకు ఎప్పుడు వ‌స్తుందనే విష‌యం చెప్ప‌లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు