Nandamuri Balayya: రేపు ‘NBK 109’ నుంచి క్రేజీ ట్రీట్?

 

Nandamuri Balayya: టాలీవుడ్ హీరో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో…టాప్ మోస్ట్ హీరోగా నందమూరి బాలయ్య కొనసాగుతున్నారు. ఏపీ రాజకీయాల్లో అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు బాలయ్య. అంతేకాకుండా ఏడాదికి రెండు సినిమాలు.. చేసుకుంటూ బాలయ్య ముందుకు వెళ్తున్నారు
అలా ఇప్పటికే అఖండ, వీర సింహారెడ్డి లాంటి సినిమాలతో సక్సెస్ అనుకున్నారు బాలయ్య బాబు.

ప్రస్తుతం నందమూరి బాలయ్య…nbk 109 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. టాలీవుడ్ దర్శకుడు బాబి కొల్లి తీస్తున్న బాలయ్య సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరో అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు… చిత్ర బృందం సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఎన్.బి.కె 109 సినిమా నుంచి అదిరిపోయే ఫైరింగ్ ట్రీట్ రానున్నట్లు… తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

- Advertisement -

సోమవారం రోజున నందమూరి బాలయ్య బర్త్డే ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ సినిమా నుంచి టీజర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. బాబి కొల్లి తీస్తున్న ఈ సినిమాలో… ఊర్వసి రౌతేలా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. అక్టోబర్ 10న అంటే దసరా సందర్భంగా.. ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ అప్డేట్ తో… నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. కాగా మొన్న హిందూపురం ఎమ్మెల్యేగా… బాలయ్య గెలిచిన సంగతి తెలిసిందే.దీంతో నందమూరి బాలయ్య… ఏపీలో మంత్రి అవుతారని కూడా చర్చ జరుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు