NBK109 : జూన్ 10న ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం.. పూనకలొచ్చేస్తాయ్ -నాగవంశీ

NBK109 : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన విశ్వక్ సేన్ హీరోగా నటించిన “గ్యాంగ్స్ ఆప్ గోదావరి” సినిమా ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతో తెలిసిందే. నేహాశెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకి, కృష్ణచైతన్య దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా నిన్న రాత్రి (మే28) గ్రాండ్ గా జరిగింది. ఇక అంజలి ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో నాజర్, సాయికుమార్, హైపర్ ఆది, మధునందన్, ప్రవీణ్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాలో లంకల రత్నాకర్ అలియాస్ రత్నగా మాస్ క్యారెక్టర్‌లో కనిపించాడు విశ్వక్ సేన్. ఇదిలా ఉండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక్కొక్కరి స్పీచ్ ఒక్కో హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. అయితే బాలయ్య అభిమానులకు మాత్రం స్పీచ్ హైలెట్స్ తో పాటు సాలిడ్ అప్డేట్ కూడా వచ్చింది. అదే NBK109 మూవీ అప్డేట్.

NBK109 Teaser Update Announced by Producer Nagavamshi

జూన్ 10న ప్లాన్ చేస్తున్నాం.. పూనకాలే..

ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా నిర్మించిన నాగవంశీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమా అదిరిపోయిందని రిలీజ్ రోజు గోదావరి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది అన్నాడు. అలాగే చిత్ర నటీనటుల గురించి ప్రశంసించగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన నందమూరి బాలకృష్ణ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో NBK109 మూవీ గ్లిమ్ప్స్ ని ప్లే చేసి అభిమానులని ఖుషి చేయగా, బాలయ్య అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. NBK109 సినిమా నుండి జూన్ 10న మరొక టీజర్ దించుతున్నామని , ఈ సారి పూనకాలే అని చెప్పుకొచ్చాడు. ఇక NBK109 ని బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను ఆగష్టు లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి విషయానికి వస్తే..

మే 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పలు వాయిదాల అనంతరం భారీ అంచనాలతో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇక అదే రోజున దీనికి పోటీగా మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నా, అందరి కళ్ళు దీనిపైనే ఉన్నాయి. విశ్వక్ సేన్ ఈ సినిమాలో లంకల రత్నాకర్ అలియాస్ రత్నగా మాస్ క్యారెక్టర్‌లో కనిపించగా, విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఈ పాత్ర హైలెట్ అవుతుందని అంటున్నారు చిత్ర యూనిట్. అలాగే అంజలి ప్రత్యేక పాత్రలో నటించగా, ఆ పాత్ర కూడా మరో హైలెట్ అవుతుందట. ఇక ఈ సినిమాకి విశ్వక్ సేన్, నందమూరి బాలకృష్ణ తమ స్పీచ్ లతో అదరగొట్టగా, హైలెట్ అయింది మాత్రం హైపర్ అది స్పీచ్. సినిమా దగ్గరి నుండి మొదలు పెట్టి, బాలకృష్ణ, విశ్వక్ సేన్ ని పొగడ్తలతో ముంచెత్తి, తెలుగు సినిమా ప్రస్తావన దాకా వచ్చి రెండు నెలలుంచి సినిమాలు చూడట్లేదు ఈ సినిమాతో కలెక్షన్ల వర్షం చూస్తారన్నాడు. ఇక విశ్వక్ సేన్ లాస్ట్ ఇయర్ దాస్ కా ధమ్కీ, ఈ ఇయర్ గామి తో హిట్స్ కొట్టగా, మరోసారి గ్యాంగ్స్ అఫ్ గోదావరి తో సూపర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ ని అందుకోవాలని చూస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు