Kajal Aggarwal: సెకండ్ ఇన్నింగ్స్ అట్టర్ ప్లాప్

టాలీవుడ్ లో దశాబ్ద కాలంగా టాప్ హీరోయిన్ స్థాయిలో ఇండస్ట్రీని ఏలిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ పంజాబీ ముందు గుమ్మ.. మగధీర సినిమాతో ఒక్క సరిగా స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకుంది. డార్లింగ్, ఆర్య 2, గోవిందుడు అందరివాడేలే, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, వివేకం, టెంపర్, బ్రదర్స్, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో దాదాపు సౌత్ ఇండస్ట్రీస్ లో ఉన్న అగ్ర నటుల సరసన నటించింది.

2020 లో గౌతమ్ కిచ్లు అనే ఓ వ్యాపారవేత్తని ప్రేమ వివాహం చేసుకొన్న ఈ బ్యూటీ ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది. పెళ్లి.. ఆ వెంటనే గర్భంతో సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ అగర్వాల్ తాజా గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో చివరిగా తాను కనిపించాల్సిన సినిమా ఆచార్య, అయితే ఆఖరి నిమిషంలో ఈమె పాత్రను సినిమా నుంచి తొలగించగా, ఆమె చివరిగా కనిపించిన సినిమా ‘హే సిమిక’.

ఇక కాజల్ కామ్ బ్యాక్ తరువాత మొదట కనిపించిన తమిళ సినిమా ‘ఘోష్టి ‘. ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కాజల్ కెరీర్ లోనే ఓ డిసాస్టర్ గా కనిపిస్తుంది. సినిమా చుసిన వారంతా నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ‘అస్సలు కథే లేని ఇలాంటి ఓ సినిమాని కాజల్ ఎలా ఒప్పుకుంది’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే వారం తెలుగు వెర్షన్ విడుదల కానుంది. ఇక ఈ సినిమా తమిళ ప్రేక్షకులని మాత్రమే ఆకట్టుకోలేకపోయిందా? లేక తెలుగులో కూడా ఇలాంటి టాకే వస్తుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -

కాగా, సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన ఫస్ట్ సినిమాకే ఇలాంటి నెగిటివ్ రివ్యూలు రావడంతో కాజల్ అభిమానులు నిరాశవ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కాజల్ అప్ కమ్మింగ్ మూవీస్ మరో రెండు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ సినిమాలో మరియు నందమూరి బాల కృష్ణ హీరో గా తెరకెక్కనున్న ‘NBK108’ సినిమాలతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు