Darling : ఇస్మార్ట్ బ్యూటీపై నెగిటివిటి.. మంచి అవకాశం పోగొట్టుకుందట!

Darling : టాలీవుడ్ లో నన్ను దోచుకుందువటే అనే చిన్న చిత్రంతో పరిచయమైన బ్యూటీ నభా నటేష్. అయితే ఐదేళ్ల కింద వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. ఈ సినిమాతో చాలా మందికి క్రష్ బ్యూటీ అయింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. అయితే కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ తప్ప మరే సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇక రెండేళ్ల కింద ఓ ఆక్సిడెంట్ లో భుజానికి చేతికి ఇంజ్యూరీ కావడంతో కొంతకాలం నటనకు దూరంగా ఉంది. అయితే చాలా రోజులకు ప్రియదర్శి డార్లింగ్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించింది. నిజానికి ఈ సినిమాపై నభా చాలా ఆశలు పెట్టుకుంది. డార్లింగ్ తో సక్సెస్ కొట్టి తన హవా చాటాలని అనుకుంది.

Negativity on Nabha Natesh's role in Darling movie

డార్లింగ్ ప్లాప్ టాక్.. నభా పై నెగిటివిటి..

అయితే డార్లింగ్‌ (Darling) సినిమాతో నభా తన కెరీర్‌ ను మళ్ళీ సక్సెస్ కొట్టి గ్రాండ్ గా స్టార్ట్ చేయాలనుకున్న తన ఆశలపై ప్లాప్ టాక్ దెబ తీసింది. సినిమా థియేటర్లలో ఫుల్ నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, సినిమా లో నభా పాత్ర కూడా ట్రోలింగ్ కి గురయ్యేలా చేసింది. నభా నటేష్ నటించిన సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించిన విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నిజానికి నభా దే మెయిన్ లీడ్ రోల్. కానీ ఇప్పుడు సినిమాకి మైనస్ నభానే అని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. నభా ప్రియదర్శి సరసన పూర్తి నిడివి ఉన్న రోల్ అలాగే ప్రధాన పాత్రను పోషించినప్పటికీ నభ కి ఏమాత్రం ఉపయోగపడలేదు.

- Advertisement -

మంచి అవకాశం మిస్ చేసుకున్న నభా…

అయితే సినిమాలో నభా నటేష్ పాత్రే ప్రధానం కాగా, సినిమా రిలీజ్ తర్వాత తనే మైనస్ అని అంటున్నారు. ఆమె తన నటనలో ఏ మాత్రం పరిణితి లేని పెర్ఫార్మన్స్ చేసిందని, సినిమాలో మొదటినుండి ఆడియన్స్ ని మెప్పించడంలో నభ విఫలమైందని అంటున్నారు. తన ఓవరాక్టింగ్ తో విసిగించిందని, ఈ పాత్ర స్వభావంలో బలం ఉన్నప్పటికీ, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న పాత్రలో నభా నటించడంలో ఫెయిల్ అయిందని ట్రోల్స్ వస్తున్నాయి. ఇస్మార్ట్ బ్యూటీ ఎంతలా ట్రోల్ అవుతుందంటే తన మునుపటి సినిమాలలో చేసిన పెర్ఫార్మన్స్ కూడా ఇందులో చేయలేదట. ఒకవేళ నభా నటన క్లిక్ అయితే, సినిమా ఫెయిల్ అయినప్పటికీ, ఖచ్చితంగా అది నభా కెరీర్‌కు ఊపిరి పోసేది. డార్లింగ్ సినిమాకు ఛాలెంజింగ్ రోల్ వచ్చినా, మంచి నటనా సామర్థ్యాన్ని నిరూపించుకునే పెద్ద అవకాశాన్ని కోల్పోయిందని విమర్శకులు అంటున్నారు. మరి రాబోయే స్వయంభు సినిమాతో నైనా ఏమైనా మెప్పిస్తుందా లేదా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు