Thangalaan : తంగలాన్ పై నెగిటివిటి.. దర్శకుడే కారణం..

Thangalaan : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమాల్లో “తంగలాన్” ఒకటి. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ పంద్రాగస్టు కానుకగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించగా, కొన్ని నిజ సంఘటనల ఆధారంగా పీరియాడిక్ హారర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి. విడుదలైన టీజర్, ట్రైలర్స్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుని అభిమానుల్లో అంచనాలు పెంచేసాయి. ఇటు విక్రమ్ కూడా ఎడతెరిపి లేకుండా నెలరోజులుగా వరుస ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. పైగా తెలుగు రాష్ట్రాల్లో కూడా విక్రమ్ (Chiyaan Vikram) తన సినిమాకు ప్రమోషనల్ టూర్లు చేస్తుండడం విశేషం. రిలీజ్ కి ఇంకా ఒక్కరోజు కూడా లేని ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివిటీ స్టార్ట్ అయింది. అయితే దీనికి కారణం దర్శకుడే అని తెలుస్తుంది.

Negativity on Thangalaan movie due to director Pa Ranjith's comments

పా రంజిత్ పై నెట్టింట ట్రోలింగ్.. సినిమాపై కూడా ఎఫెక్ట్..

ఇక రేపు విడుదల కాబోతున్న తంగలాన్ (Thangalaan) పై భారీ అంచనాలుండగా, గత కొన్ని రోజులుగా మాత్రం సినిమాపై విపరీతమైన నెగిటివిటి జరుగుతుంది. ముఖ్యంగా కోలీవుడ్ లో సోషల్ మీడియాలో నెగిటివిటి ఎక్కువయింది. దానికి కారణం సినిమా కాదు… దర్శకుడు పా రంజిత్ (Pa Ranjith) అని తెలుస్తుంది. ఓ వర్గం సోషల్ మీడియాలో ఈ నెగిటివిటి స్టార్ట్ చేయగా, కోలీవుడ్ లో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దానికి రీసెంట్ గా కొన్ని రాజకీయ పరిణామాలే కారణమని తెలుస్తుంది. అసలు విషయానికి వస్తే… రీసెంట్ గా సుప్రీం కోర్టు ఎస్సి వర్గీకరణకు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళని పక్కన బెట్టి, ఆర్ధికంగా వెనుకబడ్డ వాళ్ళకే రిజర్వేషన్లు దక్కేలా వర్గీకరణ చేయాలనీ ఎప్పట్నుంచో డిమాండ్ ఉండగా దాన్నీ వ్యతిరేకిస్తున్న వాళ్లలో పా రంజిత్ ఒకరు.

- Advertisement -

రిలీజ్ తర్వాత ప్రభావం ఉంటుందా?

ఇక పా రంజిత్ దర్శకుడైనప్పటి నుండి తీసే ప్రతి సినిమాలో దళితుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. తన సినిమాలు కూడా దళితుల మీద అగ్ర వర్గాల వివక్ష, వారి పోరాటం చుట్టూనే తిరుగుతుంటాయి. రీసెంట్ గా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పును కూడా పా రంజిత్ వ్యతిరేకిస్తూ పోస్ట్ పెట్టాడు. ఇది చాలామందికి నచ్చట్లేదు. అతను దళితులకు మద్దతుగా సినిమాలు తీయడం వరకు అయితే ఒకే.. కానీ ఇతర కులాల మీద ద్వేషం చుపిస్తున్నాడంటూ పా రంజిత్ ని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంది. ఈ క్రమంలో తన ‘తంగలాన్’ సినిమాపై నెగిటివిటి మొదలెట్టారు. సినిమాని బ్యాన్ చేయాలనీ కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. మరి ఇది తమిళనాట ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి. అయితే తంగలాన్ కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఈ విషయాన్నీ పెద్దగా పట్టించుకోరని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు