NehaShetty : ఇప్పుడు ఈ సినిమా తన ఫెవరేట్ అయిపోయిందట… అంత నచ్చిందా!

NehaShetty :టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోయిన్లలో నేహా శెట్టి ఒకరు. మెహబూబా అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతకు ముందు చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ కూడా డీజే టిల్లు వల్ల నేహా శెట్టి దశ తిరిగింది. ఈ సినిమాలో రాధికా పాత్రలో, టిల్లు గాని పోరి గా నటించిన నేహా శెట్టి (Neha Shetty) కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకోవడమే కాకుండా, ఆ ఒక్క సినిమాతోనే భారీగా ఆఫర్లు అందుకుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఆడియన్స్ ని ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. అలాగే ఈ ఇయర్ ఆల్రెడీ టిల్లు స్క్వేర్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి సాలిడ్ ఇంపాక్ట్ చూపించింది. ఆ సినిమా హిట్ కావడానికి నేహా గెస్ట్ అప్పీరెన్స్ కూడా కారణమైందని చెప్పొచ్చు. రీసెంట్ గా గ్యాంగ్స్ అఫ్ గోదావరి తో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నా, ఇప్పటికి మంచి ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతుంది.

NehaShetty's favorite movie is Kalki 2898AD movie at the moment

తన ఫెవరేట్ మూవీ ఇప్పుడు ఇదేనట..!

ఇక నేహశెట్టి (NehaShetty) ఈరోజు ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చాట్ చేయగా, అందులో తన ఫెవరేట్ మూవీ గురించి చెప్పుకొచ్చింది. అందులో భాగంగా ఓ అభిమాని మీ ఫెవరేట్ మూవీ ఏది అని అడగగా, దానికి తన ఫెవరేట్ మూవీ ప్రస్తుతానికి ప్రభాస్ ‘కల్కి2898AD’ మూవీ అని చెప్పుకొచ్చింది. ఇక నేహా పెట్టిన ఈ స్టేటస్ ని స్క్రీన్ షాట్ తీసి ప్రభాస్ అభిమానులు షేర్ చేస్తున్నారు. అయితే ఈ హీరోయిన్ కి చాలా ఫెవరేట్ సినిమాలు ఉండొచ్చు. కానీ ఒక హీరో సినిమా చెప్తే, ఇంకో హీరో ఫ్యాన్స్ ఫీల్ అవ్వకుండా ట్రెండ్ కి తగ్గట్టు కల్కి పేరు చెప్పి బాగా తప్పించుకుందని అంటున్నారు నెటిజన్లు.

- Advertisement -

నెట్టింట బిజీబిజీ…

అలాగే ఇంస్టాగ్రామ్ లో నేహశెట్టి తన ఇతర ఫెవరెట్స్ గురించి చెప్పుకొచ్చింది. తన ఫెవరేట్ సిటీ హైదరాబాద్ అనే చెప్పుకొచ్చింది. అలాగే తనకిష్టమయిన కలర్ బ్లూ అని చెప్పుకొచ్చింది. ఇక నేహా శెట్టి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. ఇక నేహా శెట్టి ఫోటోషూట్లతోనూ రచ్చ చేస్తుంటుంది తెలిసిందేగా. ముఖ్యంగా చీరలో ఫోటో పెట్టిందంటే చాలు లక్షల్లో లైక్స్ వచ్చి పడతాయి. ఇక ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది ఈ భామ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు