Nelson: అవి అంతా స్క్రిప్ట్ కాదు, కొంత ఒరిజినల్

Nelson: చాలా ఏళ్ల క్రితం దర్శకుడుగా ఒక సినిమాను మొదలు పెట్టి అప్పుడు వచ్చిన కొన్ని అడ్డంకులు కారణంగా సినిమాను మధ్యలోనే ఆపేశాడు నెల్సన్. మళ్లీ ఆరు సంవత్సరాల తర్వాత నయనతార(Nayanathara) ప్రధాన పాత్రలో కొలమావు కోకిల అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. డార్క్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ను సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వరుణ్ డాక్టర్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు నెల్సన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బీస్ట్(Beast) సినిమా డిజాస్టర్ అయింది. అయితే అప్పటివరకు మంచి దర్శకుడుగా పేరు సాధించుకున్న నెల్సన్ ఒక ప్లాప్ సినిమా పడగానే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే సన్ నెట్వర్క్ సంస్థతో జైలర్ అనే సినిమాకు కమిట్ అయ్యాడు నెల్సన్. ఇక రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెల్సన్ కెరీర్ కు అది స్ట్రాంగ్ కం బ్యాక్ ఫిలిం అయింది.

 Nelson Dilipkumar

- Advertisement -

ఇక నెల్సన్ విషయానికి వస్తే, నెల్సన్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆ కామెడీ టైమింగ్ నెల్సన్ సినిమాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. నెల్సన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సాంగ్ ను రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక వీడియోను రిలీజ్ చేస్తారు. ఆ ప్రమోషనల్ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నెల్సన్ ను అది స్క్రిప్ట్ ఆ అని ఒకరు ప్రశ్నించారు. దానికి సమాధానంగా నెల్సన్ మాట్లాడుతూ..దానిలో ఒరిజినల్ కాన్వర్జేషన్ ఉంటుంది. ఒక 50% మాత్రమే స్క్రిప్టెడ్ లా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు నెల్సన్ చేసిన అటువంటి వీడియోస్లో బీస్ట్ సినిమాలోని అరబిక్ కుత్తు సాంగ్ బాగా పాపులర్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు