Rajamouli : రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్.. హ్యాట్సాప్ చెబుతున్న హీరోలు…

Rajamouli : టాలీవుడ్ డైరెక్టర్స్ లో రాజమౌళి పేరుకు ప్రత్యేక స్థానం ఉంది.. ఆయన చేస్తున్న సినిమాలు ఆలస్యంగా వస్తున్నా కూడా భారీ సక్సెస్ ను అందుకోవడం పక్కా.. అందుకే ఈయనతో సినిమాలు అంతే హీరోలు ఆసక్తి కనబరుస్తారు. రాజమౌళి సినిమాలకు ఒక లెక్క ఉంటుంది. అందుకే విదేశాల్లో కూడా ఈయన సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు.. ఆయన సినిమా లైఫ్ గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ వెతుకుతూ ఉంటారు.. అలాంటి వారి కోసం నెట్ ఫ్లిక్స్ సరికొత్త ప్రయోగం చేస్తుంది.. రాజమౌళి సినిమాల జర్నీ గురించి డాక్యుమెంటరీని క్రియేట్ చేస్తున్నారు.. దానికి సంబందించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.. ప్రస్తుతం అది ట్రెండ్ అవుతుంది..

రాజమౌళి డాక్యూమెంటరీ గురించి ప్రముఖ ఓటీటీ సంస్థ గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా దానికి సంబందించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.. ఆ వీడియోలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు రాజమౌళి తో పనిచేసిన అనుభవం గురించి పంచుకున్నారు.. అతని వ్యక్తిత్వం గురించి చెప్పినట్లు వీడియో లో కనిపిస్తున్నాయి.. ఆ ట్రైలర్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.. డాక్యుమెంటరీ కోసం జక్కన్న ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..

Netflix has released the trailer of Rajamouli's documentary
Netflix has released the trailer of Rajamouli’s documentary

ఇక జక్కన్న పేరు చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించుకున్నాడు.. విదేశాలలో కూడా ఈయనకు, సినిమాలకు వీరాభిమానులు ఉన్నారు.. వారిని ఊరించేందుకు జక్కన్న అప్పుడప్పుడు వెళ్తు వస్తున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో అదిరిపోయే కథతో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమాకు కథను పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.. మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ రాబోతుందని టాక్. ఇక సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్ళానున్నారని సమాచారం..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు