Bollywood: ఇలియానా చేసిన పనికి ఫైర్ అవుతున్న నెటిజన్లు

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా యూత్ క్రష్ గా ఓ వెలుగు వెలిగిన నటి ఇలియానా. తెలుగులో దేవదాసు సినిమాతో తెలుగులో పరిచయమై ఫస్ట్ మూవీ తోనే సూపర్ హిట్ కొట్టి పెద్ద ఆఫర్లు అందుకుంది. పోకిరి సినిమా తో స్టార్ హీరోయిన్ గా మారి అప్పటి యూత్ ని తన గ్లామర్ తో పడగొట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్స్ సరసన నటించింది. జల్సా, కిక్, ఆట, జులాయి లాంటి సినిమాలతో తన టాలీవుడ్ లో తన ముద్ర వేసింది. అయితే ఆ తర్వాత ప్లాపులు రావడం, ఆఫర్లు తక్కువవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది.

హిందీ లో మొదటి సినిమా బర్ఫీ తో మంచి హిట్ వచ్చినా, తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా ఆడకపోవడంతో ఆఫర్లు రాలేదు. బాలీవుడ్ ఆఫర్స్ కోసం తెలుగు ప్రేక్షకులకి దూరం అయినా, ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ద్వారా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ అవడం తో ఇలియానా కెరీర్ చాలా డౌన్ అయింది.  హిందీ లో ప్రస్తుతం అన్ ఫెయిర్&లవ్లీ అనే సినిమాలో నటిస్తుండగా, అప్పుడప్పుడూ ప్రైవేట్ సాంగ్స్ లోను నటిస్తుంది.

అయితే ఇలియానా తాజాగా ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ లో రెండు పిక్స్ ఉన్నాయి. బూడిద రంగులో ఉన్న ఒక టీ షర్ట్, అలాగే మామ అని పేరుతో ఉన్న ఒక చైన్ పిక్స్ పెట్ట్టి, “కమింగ్ సూన్”, “నిన్ను కలవడానికి వేచి ఉండలేను, నా చిన్ని కన్నా” అని కామెంట్ పెట్టింది. దీనికి సెలెబ్రిటీ లు కూడా కంగ్రాట్స్ చెప్తూ విష్ చేస్తున్నారు. ఈ పోస్ట్ కింద కామెంట్స్ లో ఇలియానా తల్లి సమీరా , కొత్త లోకం లోకి స్వాగతిస్తూ బేబీ కోసం వెయిట్ చేస్తున్నామని పెట్టింది. దీన్ని బట్టి ఇలియానా తల్లి కాబోతుందని ఇట్టే తెలిసిపోతుంది.

- Advertisement -

అయితే ఈ విషయం పై సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తూ విష్ చేస్తుంటే, కొంతమంది నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కారణం ఇలియానా కి ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడే బిడ్డ ఏంటి, ఇలాంటి పని చేయడానికి కొంచమైనా సిగ్గుండాలి అంటున్నారు. అంతే కాదు తన రిలేషన్ గురించి గాని, తన బాయ్ ఫ్రెండ్ గురించి గాని ఇలియానా ఎక్కడ చెప్పలేదు. మరి తాను ఎవరి ద్వారా తల్లి అయిందో తెలియక పబ్లిక్ ఇలియానాపై మండి పడుతున్నారు. కొన్ని రోజుల కింద విడుదలైన ఒక ప్రైవేట్ సాంగ్ లో కూడా ఇలియానా లావుగా కనిపించింది. అప్పుడే చాలా మందికి ఇంత లావెందుకయింది అని సందేహ పడ్డారు. కానీ ఈ విషయం ఉంటుందని ఊహించలేదు.

అయితే కత్రినా కైఫ్ కజిన్ అయిన లారెంట్ మైఖేల్ తో ఇలియానా రిలేషన్ షిప్ లో ఉందంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కలిసిన పిక్స్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. బహుశా ఇలియానా బాయ్ ఫ్రెండ్ తనే అయ్యుంటాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు