MR Bacchan : సితార్ సాంగ్ పై ట్రోలింగ్.. ఆ డ్యాన్స్ ఏంటి.. హీరోయిన్ తో ఆ భంగిమ ఏంటి భయ్యా?

MR Bacchan : మాస్ మహారాజ్ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘మిస్టర్ బచ్చన్’ అంటూ ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ రైడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై క్రేజీ అంచనాలున్నాయి. రవితేజ హరీష్ శంకర్ ల హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి అభిమానుల్లో కూడా క్రేజీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో రవితేజ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడని భావిస్తున్నారు. ఇక ఆ మధ్య రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ కూడా మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఇక ఈ సినిమాతో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయమవుతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి ‘సితార్’ పేరుతో ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. కాసేపటికిందే రిలీజ్ చేసిన ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది.

Netizens trolling on MR Bacchan movie 'Sitar' song

సాంగ్ పై ట్రోలింగ్.. నెటిజన్ల విమర్శలు…

మిస్టర్ బచ్చన్ (MR Bacchan) నుండి తాజాగా సితార్ పేరుతో ఒక మెలోడీ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. కాసేపటికిందే రిలీజ్ అయిన ఆ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సాంగ్ పై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. పాట యావరేజ్ గా ఉండగా, కోరియోగ్రఫీ మాత్రం దరిద్రంగా ఉందని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై ఫైర్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్. సీనియర్ స్టార్ అయిన రవితేజతో హీరోయిన్ తో కొన్ని డాన్స్ మూమెంట్లు అస్సలు బాగాలేవని, తనకన్నా వయసులో చాలా చిన్న ఏజ్ అయిన అమ్మాయితో రవితేజ నటించడమే ఒక ఎత్తయితే, పాటలో కొన్ని బిట్స్ లో హీరోయిన్ నడుం వెనక భాగాన చేయి వేసి చేసిన డాన్స్ మూమెంట్ అస్సలు బాగాలేదని, సాంగ్ ని మళ్ళీ రీషూట్ చేయాలనీ రవితేజ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పైగా కొన్ని మూమెంట్స్ ఏవో భంగిమలను పోలి ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

- Advertisement -

డేట్ దగ్గరికొస్తుంది.. నో హైప్..

ఇక రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిషింగ్ దశకు చేరుకోగా, సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు సరైన బజ్ సినిమాపై కలగలేదు. ఇకనైనా మేకర్స్ మేలుకుని కరెక్ట్ గా ప్రమోషన్స్ చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. లేదా కంటెంట్ పై మౌత్ టాక్ పై డిపెండ్ అవ్వాల్సిందే. ఇక మిస్టర్ బచ్చన్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సె హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు