RajTarun : రాజ్ తరుణ్ ని ఆడేసుకుంటున్న నెటిజన్లు.. నీ మొహానికి ఈ టైటిల్ అవసరమా అంటున్నారు…

RajTarun : రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం తరవాత తన కెరీర్ అధోగతి గా మారిందని చెప్పొచ్చు. రోజుకో ట్విస్టులతో రాజ్ తరుణ్ లావణ్య కేసు మలుపులు తిరుగుతుంది. ఈ కేసుపై ఇంకా విచారణ జరుగుతుండగా, రాజ్ తరుణ్ కెరీర్ కి మాత్రం ఈ కేసు శాపంగా మారిందని చెప్పాలి. విడుదలకు రెడీ అవుతున్న రాజ్ తరుణ్ నాలుగు సినిమాలపై లావణ్య కేసు ప్రభావం చూపుతుంది. ఈ సినిమాల నుండి ఎలాంటి అప్డేట్స్ వస్తున్నా ఆడియన్స్ అస్సలు పట్టించుకోవట్లేదు. రాజ్ తరుణ్ తో చేస్తున్న సినిమాల నిర్మాతలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ చేయడానికి జంకుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే రాజ్ తరుణ్ (RajTarun) నెటిజన్లు ఎంత ఆడేసుకుంటున్నారంటే, ట్రోల్ చేయడానికి ఎలాంటి సందర్భం దొరికినా వదలట్లేదు.

Netizens trolling RajTarun on social media

నీ మొహానికి ఈ టైటిల్ అవసరమా అంటున్న నెటిజన్లు…

ఇదిలా ఉండగా తాజాగా రాజ్ తరుణ్ నటించిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అందులో ఒక సినిమాకి సంబంధించి రాజ్ తరుణ్ ని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. జులై 26న రాజ్ తరుణ్ నటించిన “పురుషోత్తముడు” అనే సినిమా విడులవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రమోషన్లు మేకర్స్ చేస్తుండగా, పురుషోత్తముడు మూవీ పోస్టర్స్ లో రాజ్ తరుణ్ ని చూసి, ట్రోల్ చేస్తున్నారు. నువ్వు చేసిన ఘన కార్యాలకు, నీ మొహానికి పురుషోత్తముడు అనే టైటిల్ అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు. లావణ్య కేసు ఇంకా విచారణ జరుగుతున్నప్పటికీ రాజ్ తరుణ్ కి ఇలా విమర్శలు తప్పట్లేదు.

- Advertisement -

కేసు వల్ల రిలీజ్ ఇబ్బందులు..

అయితే రాజ్ తరుణ్ లావణ్య కేసు వల్ల తన సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు జంకుతున్నారు. పురుషోత్తముడు సినిమాతో పాటు, తిరగబడ్డారు సామీ, భలే ఉన్నాడే సినిమాలు రిలీజ్ కి రెడీ అయినా, ఈ కేసు వల్ల వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక వీటిలో పురుషోత్తముడు సినిమాను మాత్రం జులై 26న తప్పక రిలీజ్ చేస్తున్నారు. ఇక రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య రాజ్ పై కేసు పెట్టి ఇంకా తానే కావాలని లాయర్ తో పోరాటం చేస్తుంది. మరి లావణ్య తో ప్రేమ వ్యవహారం కేసు ఇప్పటివరకు కొనసాగుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు