Sekhar Kammula – Nani : న్యాచురల్ స్టార్ తో ఫ్యామిలీ డైరెక్టర్ కొత్త మూవీ.. అదే కథతో స్టోరీ..

Sekhar Kammula – Nani : తెలుగులో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ప్రత్యేక స్థానం ఉంది.. ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు.. ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.. ‘కుబేర’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఆ సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. న్యాచురల్ స్టార్ నాని తో తర్వాత సినిమా చేయబోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది..

డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగార్జున – ధనుష్ కాంబోలో కుబేర అనే మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.. చివరి షెడ్యూల్ షూటింగ్ ను శ‌ర వేగంగా జ‌రుపుకొంటోంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా తర్వాత శేఖ‌ర్ క‌మ్ముల ఏ హీరోతో సినిమా చేస్తాడు? ఎలాంటి కథతో రాబోతున్నాడు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..

new movie of family director sekar kammula with natural star
new movie of family director sekar kammula with natural star

అయితే ఈయన ఈసారి టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నానితో జ‌ట్టు క‌ట్టే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఈమేర‌కు ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని ఇండస్ట్రీలో వర్గాల్లో టాక్ నడుస్తుంది.. నాని ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.. లైన్లో హిట్ 3 సినిమా కూడా ఉంది.. ఆ సినిమా అయ్యాకే మరో సినిమా గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఆ సినిమాలు అన్ని అయ్యాకే మరో సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. కుబేర తర్వాతే శేఖర్ కమ్ముల కొత్త సినిమా పై కసరత్తులు మొదలు పెడతారని టాక్. మొత్తానికి ఈ కాంబో మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది.. అయితే లవ్ స్టోరీతో సినిమా రాబోతుందని సమాచారం.. మరి ఈ సినిమా గురించి ఎప్పుడు ప్రకటన వస్తుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు