New Movies : సినిమాలపై ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్… ఈ రెండు సినిమాలకు భారీ నష్టం

New Movies : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎగ్జిట్ పోల్స్ పైనే దృష్టి పెట్టారు. ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. రిజల్ట్స్ వచ్చేదాకా ప్రేక్షకుల మూడ్ మారే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో రిలీజ్ అయిన ఓ రెండు సినిమాలకు భారీ నష్టం తప్పేలా కనిపించడం లేదు. ఆ సినిమాలు ఏంటి ? వాటికి ఎగ్జిట్ పోల్స్ వల్ల జరిగే నష్టం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

అదృష్టం పరీక్షించుకున్న మూడు సినిమాలు

ఈ శుక్రవారం అంటే మే 31న మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయ భజే వాయువేగం, ఆనంద్ దేవరకొండ గంగం గణేశ సినిమాలు థియేటర్లలోకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. అయితే ఈ మూడు సినిమాల్లో కొద్దో గొప్పో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికే పాజిటివ్ టాక్ వచ్చింది. మిగతా రెండు సినిమాలకు మాత్రం పెదవి విరిచారు విమర్శకులు. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ అయిన ఈ మూడు సినిమాలపై ఎగ్జిట్ పోల్స్ అనే బండరాయి గట్టిగానే పడింది.

Bhaje Vaayu Vegam Archives - TrackTollywood

- Advertisement -

ఎగ్జిట్ పోల్స్ తో నష్టమేంటి?

నిజానికి ఎలక్షన్ ఫీవర్ జనాల్లో చాలా గట్టిగా ఉంటుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఎన్నో సినిమాలు కల్కితో సహ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల వైపు జనాల రాక బాగా తగ్గడంతో  థియేటర్ల యాజమాన్యం దాదాపు పది రోజులపాటు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్లను బంద్ చేశారు. ఇటీవలే లవ్ మీ మూవీతో మళ్ళీ థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కానీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. థియేటర్లు రీఓపెన్ అయ్యాక ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే కలెక్షన్లను రాబట్టలేక పోయింది. అంతేకాకుండా జనాలను థియేటర్లకు రప్పించగల కంటెంట్ గాని, హీరో బొమ్మ గాని థియేటర్లలో పడకపోవడంతో జనాలు అస్సలు సినిమాలను పట్టించుకోవట్లేదు.

ఎలక్షన్ రిజల్ట్స్ పైనే దృష్టి

మరోవైపు జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల సినిమాలకు వచ్చే నష్టం ఏంటి అనే విషయంలోకి వెళ్తే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కలెక్షన్స్ నిన్నటి కంటే ఈరోజు బాగా తగ్గిపోయాయి. అలాగే భజే వాయువేగం నిన్నటి కంటే కాస్త ఇంప్రూవ్ అయింది. గంగం గణేశా పూర్తిగా వెనకబడిపోయింది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్షన్ రిజల్ట్స్ ఫీవర్ నడుస్తోంది కాబట్టి ఆడియన్స్ థియేటర్స్ కు వెళ్లకుండా ఎగ్జిట్ పోల్స్ వైపు చూస్తున్నారు. మరి ఇప్పుడే ఇలా ఉంటే జూన్ 4న రిజల్ట్స్ టైంలో ఎలా ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఈలోపే తాజాగా రిలీజ్ అయిన సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ మూడు సినిమాలకు కూడా భారీగా నష్టాలు రావడం ఖాయం అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు