Meera Chopra: 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మీరా చోప్రా సుపరిచితురాలే.. ఈ ముద్దుగుమ్మ తెలుగు , తమిళ్, హిందీ వంటి భాషలలో నటించి బాగానే పాపులారిటీ అందుకున్నది.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాతో మొదటిసారి తెలుగు తెరకు హీరోయిన్ గా అడుగుపెట్టింది.. బంగారం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇందులో హీరోయిన్ పాత్ర కాకపోయినప్పటికీ ఈమె పాత్ర చుట్టే కథ మొత్తం తిరుగుతుంది.. ఆ తర్వాత.. ఎమ్ . ఎస్. రాజు దర్శకత్వంలో వచ్చిన వాన చిత్రంతో మంచి క్రేజ్ అందుకున్నది. ఆ తర్వాత గ్రీకువీరుడు సినిమాలో కూడా అలరించిన ఈమె..ఈ తర్వాత టాలీవుడ్ కి ఒక్కసారిగా దూరమైంది.. ఆ తర్వాత 1920 లండన్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ..

మీరా చోప్రా కు బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా ,మన్నార చోప్రాలు కూడా ఈమెకు బంధువులే.. తెలుగు , తమిళ్, హిందీ వంటి భాషలలో దాదాపుగా 30 కి పైగా సినిమాలలో నటించింది.. ఇటీవల ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని వివాహ బంధం లోకి అడుగుపెట్టింది. అందుకు సంబంధించి పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది మీరా చోప్రా.. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు సైతం ఈమెకు విషెస్ తెలియజేస్తున్నారు..

మీరా చోప్రా ప్రేమ, పెళ్ళి..
గత కొన్నేళ్లుగా తన ప్రియుడు రక్షిత్ ను ప్రేమిస్తున్నానని చెప్పిన మీరా చోప్రా గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడిని కూడా పరిచయం చేసింది..ఇటీవల రాజస్థాన్లోని జైపూర్ లో మార్చి 12న వివాహం జరగగా.. 11న మెహందీ, సంగీత్ వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగినట్టు తెలుస్తోంది.

- Advertisement -

మీరా చోప్రా సినిమాలు..
మీరా చోప్రా సినిమాల విషయానికి వస్తే.. 2019లో సెక్షన్ 375 చిత్రం ద్వారా మెప్పించింది.. దాదాపుగా మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత..సఫెద్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో తన ప్రియుడు రక్షిత్ తో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం మీరా చోప్రా కు సంబంధించి పెళ్లి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మీరా చోప్రా పెళ్లిపై సరికొత్త అనుమానాలు..
ఇకపోతే మీరా చోప్రాకి ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రా లు దగ్గర బంధువులన్న విషయం తెలిసిందే ఇంత సన్నిహితంగా ఉన్నప్పటికీ మీరా చోప్రా వివాహానికి ప్రియాంక చోప్రా , పరిణితి చోప్రా మాత్రం హాజరు కాలేదు. దీంతో అభిమానులలో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. మీరా చోప్రా వీరిని తన వివాహానికి పిలువ లేదా.. ఒకవేళ పిలిచినా..వీరు రాలేదా ? రాకపోవడానికి గల కారణమేమిటి? అనే కోణంలో ఆరాతీస్తున్నారు. ఇక అసలు విషయాలు తెలియాలి అంటే ఈ విషయంపై మీరా చోప్రా స్పందించక తప్పదు.. మొత్తానికైతే మీరా చోప్రా ఒక ఇంటి కోడలు కావడంతో అభిమానులు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు