Nicholai Sachdev: భార్య కోసం అలాంటి పని.. ఏ భర్త చేయలేరుగా..?

Nicholai Sachdev: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల తాను ప్రేమించిన ప్రముఖ ముంబై ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్ దేవ్ ను వివాహం చేసుకుంది. థాయిలాండ్ లో బీచ్ దగ్గర చాలా సింపుల్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ జంట.. చెన్నైలో గ్రాండ్గా రిసెప్షన్ చేసుకోగా.. పలు భాషా పరిశ్రమల నుంచీ చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు రిసెప్షన్ కి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతేకాదు తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఈ ఈవెంట్ కి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ , నికోలయ్ సచ్ దేవ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Nicholai Sachdev: What husband can't do such work for his wife..?
Nicholai Sachdev: What husband can’t do such work for his wife..?

ఇదిలా ఉండగా తమ పెళ్లి తర్వాత మొదటిసారి కొత్తజంట వరలక్ష్మీ శరత్ కుమార్ – నికోలయ్ సచ్ దేవ్ మీడియా మీట్ నిర్వహించారు. వీరితో పాటు శరత్ కుమార్ కూడా పాల్గొన్నారు.. ఇక మీడియా సమావేశంలో భాగంగా పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన వరలక్ష్మి భర్త నికోలయ్ సచ్ దేవ్ తన భార్య గురించి, తన భార్యపై తనకున్న ప్రేమ గురించి మీడియాతో మాట్లాడుతూ..పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

వరలక్ష్మి శరత్ కుమార్ భర్త నికోలయ్ సచ్ దేవ్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత వరలక్ష్మి తన పేరును మార్చుకుందాం అనుకుంది.. శరత్ కుమార్ ను అలాగే ఉంచి వరలక్ష్మి శరత్ కుమార్ సచ్ దేవ్ గా తన పేరును మార్చుకోవాలని అనుకుంది.. కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు.. తన పేరు వరలక్ష్మి శరత్ కుమార్ అని అలాగే ఉండాలి.. నేనే ఆమె పేరును నా పేరు లోకి తీసుకుంటాను.. నికోలయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ సచ్ దేవ్ అని నేనే నా పేరును మార్చుకుంటాను.. ముఖ్యంగా శరత్ కుమార్ గారి లెగసీ, నా భార్య వరలక్ష్మి లెగసీ అలాగే కొనసాగాలి.. వారి పేర్లను మార్చుకూడదు.. నేనే వారి పేరును తీసుకుంటాను.. నా భార్యకు నేనప్పుడు అండగా ఉంటాను.. ఇకపై కూడా ఆమె సినిమాలు చేస్తుంది.. మీ అందరి ప్రేమను తనపై కురిపిస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలిపింది.

- Advertisement -

ఆమెకు మొదటి లవ్ సినిమాలు మాత్రమే.. సినిమా తర్వాతనే నేను.. తన యాక్టింగ్ వేరే లెవెల్.. ఇన్నాళ్లు సపోర్ట్ చేసినట్టే ఇకపై కూడా నేను ఆమెకు అన్ని విషయాలలో కూడా సపోర్ట్ చేస్తాను.. ఆమెకు ఏ విషయంలో కూడా ఇబ్బందులు కలిగించను అంటూ నికోలయ్ సచ్ దేవ్ వెల్లడించారు. సాధారణంగా భర్త పేరుని భార్య తన పేరుగా పెట్టుకుంటుంది.. కానీ భార్య పేరుని తన పేరుగా మార్చుకుంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు నికోలయ్.. ఏదేమైనా ఏ భర్త చేయలేని పనిని తన భార్య కోసం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు