Nidhi Agarwal: సాధారణంగా మనమందరం కూడా భోజన ప్రియులమే.. మనకు నచ్చింది దొరికితే ఎన్ని రోజులైనా సరే ఇష్టంగా తింటూ ఉంటామనడంలో సందేహం లేదు. అయితే సెలబ్రిటీల విషయానికి వస్తే.. జీరో ఫిగర్ మెయింటైన్ చేయడం కోసం, కాస్త తిండి విషయంలో డైట్ ఫాలో అవుతారు అనడంలో సందేహం లేదు. కానీ ఒక్కొక్కసారి తమకు ఇష్టమైన వంటకం కళ్ళ ఎదుట ఉంటే మాత్రం మనసు చంపుకోలేక తినేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం తనకు ఇష్టమైన ఆహారం గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. అంతేకాదు ఆహారాన్ని 365 రోజులు పెట్టినా సరే తాను ఇబ్బంది లేకుండా తింటానని చెప్పుకొచ్చింది. మరి ఆమె ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్.
సెట్ లో నిధికి సర్ప్రైజ్..
నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అద్భుతమైన నటనతో పెర్ఫార్మన్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది నిధి అగర్వాల్. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఇక నిన్న ఈమె పుట్టినరోజు సందర్భంగా రాజా సాబ్ చిత్ర బృందం సెట్ లో ఈమెకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఈమెతో కేక్ కట్ చేయించి ఫోటోలను షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి ఈమె ఫేవరెట్ ఫుడ్.
ఇడ్లీ ఉంటే బాయ్ ఫ్రెండ్ కూడా అక్కర్లేదు అంటున్న నిధి..
ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న నిధి అగర్వాల్ తనకు ఇష్టమైన ఆహారం గురించి చెప్పుకొచ్చింది. తనకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం అని తెలిపింది నిధి అగర్వాల్. హైదరాబాద్ ,చెన్నై , అమెరికా ఇలా ఎక్కడికి వెళ్లినా సరే తనకు ఇడ్లీ ఉంటే చాలని, ఇడ్లీతో చట్నీ తింటే ఆ ఫీలింగ్ వేరు అంటూ చెప్పుకొచ్చింది. మూడు పూటలా ఇడ్లీ పెట్టినా తింటానని చెప్పిన నిధి అగర్వాల్ తన డైటీషియన్ కి కూడా ఇదే చెబుతానని , అయితే ఇడ్లీలో కూడా కేవలం మూడు ఇడ్లీలు మాత్రమే తింటానని, ఒకవేళ నాలుగు ఇడ్లీలు ప్లేటుకి వచ్చినా ఇంకొక ఇడ్లీ ఇతరులకు ఇచ్చేస్తానని కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే ఇడ్లీ అంటే పడి చచ్చిపోతానని , ఇడ్లీ ఉంటే బాయ్ ఫ్రెండ్ కూడా అక్కర్లేదు అంటూ తెలిపింది. ఇక ఈ విషయం తెలిసి నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇడ్లీ అంటే మరీ ఇంత ఇష్టమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్న నిధి అగర్వాల్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.