Niharika Konidela : పాపం మెగా డాటర్… చిరు మూవీలో నటిస్తే ఎడిటింగ్‌లో ఫుల్ రోల్‌నే లేపేశారు..

Niharika Konidela : మెగా ఫ్యామిలీలో హీరోలు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. కానీ అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీలోకి రాలేదు. నాగబాబు కూతురు నిహారిక ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. రెండు సినిమాలు చేసింది. ఆ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ టాక్ ను అందించలేదు. ఈమె హీరోయిన్ గానే కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించిందని చాలా మందికి తెలియదు. నిహారిక చిరంజీవి సినిమాలోనే నటించిదట. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇంతకీ ఏ సినిమాలో నటించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే బుల్లితెర పై హోస్ట్ గా పలు షోలు చేసింది. అక్కడ హిట్ టాక్ ను అందుకున్న పాపకు సినిమాలు సక్సెస్ టాక్ ను ఇవ్వలేక పోయాయి. ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ ను అందుకోలేక పోయాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా చేసిన ఆమె క్యారక్టర్ ను ఎడిటింగ్ లోనే లేపేసినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా అంజి లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిందట. కానీ ఆ సినిమా ఎడిటింగ్ లోనే ఆ పాత్రను లేపేసినట్లు ఆ వీడియోలో పేర్కొంది. దాంతో తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా చెయ్యలేదని చెప్పింది.

Niharika acted as a child artist in Chiranjeevi's Anji movie
Niharika acted as a child artist in Chiranjeevi’s Anji movie

ఇకపోతే ఇటీవల కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.. కొత్తగా నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పింక్ ఏలిఫెంట్ అనే బ్యానర్ పై కొత్త సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక నిర్మాతగా చేసిన కమిటీ కుర్రోళ్లు సినిమాతో మొదటి సారిగా బాక్సాఫీస్ వద్దకు వచ్చింది. ఈ చిత్రానికి ఫుల్ పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. గత వారం నుంచి ఈ సినిమా గురించి ఓ రేంజులో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిహారిక ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్బంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. నిన్న ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఎన్నో విషయాలను బయట పెట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు